మార్పింగ్ చేసి నగ్న చిత్రాలు అప్‌లోడ్: నిందితుడి అరెస్ట్

By narsimha lodeFirst Published Mar 10, 2021, 4:59 PM IST
Highlights

మార్ఫింగ్‌ చేసిన నగ్న చిత్రాలు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసి తన క్లాస్‌మేట్‌ను  వేధించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: మార్ఫింగ్‌ చేసిన నగ్న చిత్రాలు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసి తన క్లాస్‌మేట్‌ను  వేధించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.నాగర్‌కర్నూల్‌ జిల్లాకు కేంద్రానికి చెందిన మునగపాటి శివరామకృష్ట తనతో పాటు ఇంజనీరింగ్‌ చదివిన క్లాస్‌మేట్‌ ఫోన్‌నంబర్‌ సేకరించాడు.

 ఆమెతో తరచుగా వాట్సాప్‌ చాటింగ్‌ చేసేవాడు. ఓ రోజు ఆమె ఫొటో మార్ఫింగ్‌ చేసి అసభ్య ఫొటో పంపాడు. న్యూడ్‌గా వీడియో కాల్‌ మాట్లాడకపోతే దానిని సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన ఆమె అతడు చెప్పినట్లే చేసింది.ఆమె న్యూడ్‌గా మాట్లాడే సమయంలో స్క్రీన్ షాట్లు  తీసుకున్నాడు. వీడియోను కూడా రికార్డు చేశాడు. 

ఆ యువతి మరో యువకుడితో స్నేహంగా ఉండటం గమనించి నిలదీశాడు. ఆమె అతడంటే ఇష్టమని చెప్పింది. దీంతో శివరామకృష్ణ ఆమె ఫొటోలను సోషల్‌మీడియా గ్రూపుల్లో అప్‌లోడ్‌ చేశాడు. ఆమె సెల్‌నంబర్‌ను పోస్టు చేశాడు. దీంతో పలువురు ఫోన్‌ చేసి ఆమెను వేధింపులకు గురి చేశాడు.

ఆమె రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడు ఫోన్‌లో ఉన్న నగ్న చిత్రాలు, వీడియోలు డిలీట్‌ చేసి, పోలీసులకు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. పోలీసులు సాంకేతిక ఆధారంగా వీడియోలు, ఫొటోలు పోలీసులు తిరిగి రాబట్టడంతో నిందితుడు చేసిన తప్పు ఒప్పుకున్నాడు.
 

click me!