మనోహరాచారిని తన్నింది నేను కాదు.. అసద్

Published : Sep 25, 2018, 12:50 PM IST
మనోహరాచారిని తన్నింది నేను కాదు.. అసద్

సారాంశం

మనోహరాచారిని తన్నినట్టు సీసీటీవీలో కనిపిస్తున్న యువకుడు.. ఎర్రగడ్డ డివిజన్‌ జహరా గుల్హన్‌ నూర్‌ బాగ్‌బస్తీకి చెందిన అసద్‌ అని ప్రచారం జరిగింది.

నడి రోడ్డుపై కూతురు, అల్లుడిపై ఇటీవల ఓ వ్యక్తి దాడి చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. మనోహరాచారి అనే వ్యక్తి.. తన కూతురు వేరే కులస్థుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో నడి రోడ్డుపై కొబ్బరిబోండాలు నరికే కత్తితో కూతురు, అల్లుడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో కూతురు మాధవి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. అల్లుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

అయితే.. ఈ ఘటనలో ఓ వ్యక్తి హీరో అయ్యాడు. మనోహరాచారి కూతురిపై దాడి చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి అతనిని కాలితో తన్నాడు. ఆ సమయంలో అతను మనోహరాచారిని అలా అడ్డుకోకుంటే.. ఈ పాటికి మాధవి కన్నుమూసి ఉండేది. అతను అలా దాడిచేయడం వల్లే మనోహరాచారి అక్కడి నుంచి పారిపోయాడు. మనోహరాచారిని తన్నినట్టు సీసీటీవీలో కనిపిస్తున్న యువకుడు.. ఎర్రగడ్డ డివిజన్‌ జహరా గుల్హన్‌ నూర్‌ బాగ్‌బస్తీకి చెందిన అసద్‌ అని ప్రచారం జరిగింది.
 
‘యువతిని రక్షించేందుకు ఒక యువకుడు ప్రాణాలకు తెగించాడు. సంఘటనా స్థలంలో చాలా మంది ఉన్నా.. విచక్షణారహితంగా నరుకుతుంటే చూస్తే ఉన్నారే తప్ప, ఎవరూ స్పందించలేదు. ఈ క్రమంలో మనోహరాచారిని వెనుకనుంచి ఓ యువకుడు బలంగా తన్నాడు. దీంతో మనోహరాచారి వెనక్కి తగ్గాడు.’ అంటూ ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అయితే, ఈ సాహసం చేసింది తానేనని అసద్‌ అనే యువకుడు చెప్పుకున్నాడని కూడా సోషల్‌ మీడియాలో వచ్చింది. ఇదే విషయాన్ని మీడియా కూడా ప్రచురించింది. 

ఈ నేపథ్యంలో ఎస్‌ఆర్‌నగర్‌ సీఐ వెంకటేశ్వరరావు అసద్‌ను పిలిచి విచారించారు. అది తాను కాదని అసద్‌ స్పష్టం చేశాడు. సోషల్‌ మీడియాలో జరిగిన ప్రచారంలోనూ తన ప్రమేయం లేదని చెప్పారు. ఆ సాహస యువకుడిని గుర్తించేందుకు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు.

related news

ఎస్ఆర్ నగర్ దాడి: మాధవి తండ్రిని వెనక నుంచి తన్నిందెవరో తెలుసా...

భార్యకు చివరి కాల్: అదే మనోహరాచారిని పట్టిచ్చింది

మాధవి కేసులో మందకృష్ణ మాదిగ అనుమానం ఏంటంటే

సైకోలా చేస్తాడనే పెళ్లి గురించి ముందే డాడీకీ చెప్పలేదు: మాధవి సోదరుడు

నా భార్యే కారణం, ఆమెనే చంపాల్సింది: మనోహారాచారి

ఇంకా మాధవి పరిస్థితి విషమంగానే: హెల్త్ బులెటిన్ విడుదల

'మూడు మర్డర్లు చేశాను... కానీ... మారుతీరావులా చేయను'

మాపై దాడికి ఆమె కారణం, మాధవికి బ్రెయిన్ వాష్ చేసేది: సందీప్ సంచలనం

తండ్రి దాడి: మాధవి పరిస్థితిపై ఇప్పుడే చెప్పలేమంటున్న డాక్టర్లు

ఎస్ఆర్ నగర్ దాడి: లొంగిపోయిన మనోహరాచారి, మాధవి పరిస్థితి విషమం

ఎస్ఆర్ నగర్ దాడి: నమ్మించి నవదంపతులను నరికిన అమ్మాయి తండ్రి

టెన్త్ క్లాస్‌ నుండే ప్రేమ: కులాంతర వివాహం నచ్చకే తండ్రి దాడి

నవదంపతులపై దాడి: బట్టలు పెడతామని పిలిచి ఘాతుకం (వీడియో)

ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu