సీఎల్పీ టీఆర్ఎస్ఎల్పీలో విలీనం: హైకోర్టులో షబ్బీర్ సవాల్

By narsimha lodeFirst Published Dec 24, 2018, 5:01 PM IST
Highlights

మండలిలో సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ సోమవారం నాడు హైకోర్టును ఆశ్రయించారు.
 


హైదరాబాద్: మండలిలో సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ సోమవారం నాడు హైకోర్టును ఆశ్రయించారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు తమను టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాలని కోరుతూ మండలి ఛైర్మెన్‌కు  వినతి పత్రం ఇచ్చారు.ఈ వినతి పత్రం ఆధారంగా సీఎల్పీని టీఆర్ఎసఎల్పీలో విలీనం చేస్తూ మూడు రోజుల క్రితం శాసనమండలి సెక్రటరీ బులెటిన్ విడుదల చేశారు. అంతేకాదు మండలిలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడ  రద్దైంది.

రాజ్యాంగ విరుద్దంగా  సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేశారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.శాసనమండలి ఛైర్మెన్ తీసుకొన్న నిర్ణయం సరైంది కాదని  కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేయడం గతంలో  రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొనే చేసినట్టుగా  శాసనమండలి వర్గాలు చెబుతున్నాయి.

సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

శాసనమండలి ఛైర్మెన్ , సెక్రటరీతో పాటు టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీని విలీనం చేయాలని  కోరిన నలుగురు ఎమ్మెల్సీలు ఆకుల లలిత, ప్రభాకర్ రావు, సంతోష్ కుమార్, కూచకుళ్ల దామోదర్ రెడ్డిలను ప్రతివాదులుగా చేర్చారు.

సంబంధిత వార్తలు

 కాంగ్రెస్‌కు మరో షాక్‌కు కేసీఆర్: అసెంబ్లీలోనూ మండలి ప్లాన్

మండలిలో సీఎల్పీ టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం: హైకోర్టుకు కాంగ్రెస్

స్వామిగౌడ్‌తో కొండా దంపతుల భేటీ: ఎమ్మెల్సీ పదవికి మురళి రాజీనామా

సండ్ర, మచ్చాలకు టీఆర్ఎస్ గాలం: పార్టీ మార్పుపై తేల్చేసిన ఎమ్మెల్యేలు

కేసీఆర్ దెబ్బ: నాడు టీడీపీ, నేడు కాంగ్రెస్ విల విల

రంగంలోకి ఉత్తమ్: ఆ నలుగురిపై వేటుకు కాంగ్రెస్ డిమాండ్

కేసీఆర్ షాక్: మండలిలో కాంగ్రెస్ఎల్పీ టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం

‘ఏపీలో స్పీకర్, ఛైర్మన్ చట్టాన్ని కాపాడుతున్నారు.. కానీ తెలంగాణలో’’

కేసీఆర్ ప్లాన్ ఇదే: మండలిలో కాంగ్రెస్ గల్లంతు

టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ శాసనమండలి ఎల్‌పీ వీలీనం..?

పార్లమెంట్‌ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి: జనవరి నుండి ప్రచారం

పార్టీ అన్యాయం చేయలేదు.. బాబు ప్రచారం నచ్చలేదు: కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

సీఎల్పీ మీటింగ్ జరగలేదు.. ఎవరు చేయిస్తున్నారో అందరికీ తెలుసు: ఉత్తమ్

 

click me!