పరువు హత్య: తల్లితో అనురాధ చివరి మాటలు

By narsimha lodeFirst Published Dec 24, 2018, 4:12 PM IST
Highlights

మంచిర్యాల జిల్లాలో జరిగిన పరువు హత్య కేసులో   నిందితులు నేరాన్ని అంగీకరించారు. వేరే కులానికి చెందిన అబ్బాయిని వివాహం చేసుకోవడంతో  అనురాధను హత్య చేసినట్టు తండ్రి సత్తెన్న ఒప్పుకొన్నాడు.


మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో జరిగిన పరువు హత్య కేసులో   నిందితులు నేరాన్ని అంగీకరించారు. వేరే కులానికి చెందిన అబ్బాయిని వివాహం చేసుకోవడంతో  అనురాధను హత్య చేసినట్టు తండ్రి సత్తెన్న ఒప్పుకొన్నాడు.

 మంచిర్యాల జిల్లా  జన్నారం  మండలం కలమడుగులో ప్రేమ పెళ్లి చేసుకొందని అనురాధను  కుటుంబసభ్యులు డిసెంబర్  23వ తేదీన హత్య చేసిన విషయం తెలిసిందే.

తమ పరువు తీసిందనే ఉద్దేశ్యంతోనే తన కూతురును గొంతు నులిమి చంపినట్టుగా  అనురాధ తండ్రి సత్తెన్న ఒప్పుకొన్నాడు. చనిపోయే ముందు తన కూతురిని తల్లితో మాట్లాడించినట్టు సత్తెన్న చెప్పారు. కులంలో పరువు పోయిందనే ఉద్దేశ్యంతోనే ఇలా చేయాల్సి వచ్చిందని సత్తెన్న అతని కొడుకు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తేల్చి చెప్పారు.

నాలుగేళ్లుగా ప్రేమించుకొన్న అనురాధ, లక్ష్మీరాజ్యం(లక్ష్మణ్)లు ఈ నెల 3వ తేదీన వివాహం చేసుకొన్నారు.  పెళ్లి చేసుకొన్న తర్వాత డిసెంబర్ 23వ తేదీనే స్వగ్రామానికి తిరిగి వచ్చారు.  గ్రామానికి  భర్తతో కలిసి తన కూతురు వచ్చిన విషయం తెలిసిన వెంటనే కుటుంబసభ్యులు అనురాధను భర్త ఇంటి నుండి తీసుకెళ్లి చంపేశారు.

కూతురిని చంపేసిన ఆనవాళ్లు కూడ దొరకుండా బూడిదను పంటపొలంలోని నీళ్లలో కలిపారు. ప్రేమ విషయం తెలిసిన తర్వాత లక్ష్మణ్ పై సత్తెన్న కుటుంబసభ్యులు  కేసులు కూడ పెట్టారు. తన భార్యను చంపేస్తారని తాను ఊహించలేదని లక్ష్మన్ చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

పరువు హత్య : చంపేస్తారని ఊహించలేదంటున్న భర్త లక్ష్మీరాజం

పరువు హత్య: మా నాన్నదే బాధ్యత: అనురాధ సెల్ఫీ వీడియో

పరువు హత్య:లవ్ మ్యారేజీ చేసుకొన్న కూతురును చంపిన పేరేంట్స్

ప్రణయ్ కాంస్య విగ్రహం: అమృతకు అందించిన తమిళనాడు దంపతులు

ప్రణయ్ హత్య నిందితులపై పీడీ యాక్ట్

ప్రణయ్ ఆత్మతో మాట్లాడిస్తాం: అమృత ఏం చేసిందంటే...

అమృతను కించపరుస్తూ కామెంట్...యువకుడు అరెస్ట్

అసభ్యకరమైన పోస్టులు.. పోలీసులకు అమృత ఫిర్యాదు

పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి

 

click me!