సైదాబాద్‌లో మైనర్ బాలికపై రేప్, హత్య: బాధితుల ఇంటి ముందే షర్మిల దీక్ష

By narsimha lodeFirst Published Sep 15, 2021, 2:18 PM IST
Highlights

సైదాబాద్ సింగరేణి కాలనీలో మైనర్ బాలికపై రేప్ చేసి హత్యచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ఆమె బుధవారం నాడు పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసేవరకు దీక్ష చేస్తానని ప్రకటించారు.

హైదరాబాద్: సైదాబాద్ సింగరేణి కాలనీలో బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు దీక్ష చేస్తానని వైఎస్ఆర్‌‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు.సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు నిందితుడు రాజు. రాజు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాజు ఆచూకీ చెబితే రూ. 10 లక్షల రివార్డు ఇస్తామని పోలీస్ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.

బాధితురాలి ఇంటి వద్ద వైఎస్‌ షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు.. బాధిత కుటుంబానికి రూ.10కోట్ల పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ హయాంలో మహిళలపై లైంగికదాడులు అధికమయ్యాయని మండిపడ్డారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్‌ వెంటనే స్పందించాలని వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.

also read:సైదాబాద్‌లో మైనర్ బాలికపై రేప్, హత్య: బాధిత కుటుంబానికి షర్మిల పరామర్శ

బుధవారం నాడు వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.  మైనర్ బాలిక కుటుంబానికి రూ. 10 కోట్లు పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.సీఎం కేసీఆర్ స్పందించేవరకు తాను ఇక్కడే కూర్చొంటానని ఆమె తేల్చి చెప్పారు. తెలంగాణలో గంజాయి, మద్యం ఏరులై పారుతోందని ఆమె మండిపడ్డారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా అని ఆమె ప్రశ్నించారు.
 

click me!