తెలంగాణలో మిస్సయిన ఘోరప్రమాదం.. నిద్రమత్తులో బస్సును చెట్టుకు ఢీకొట్టిన ఆర్టీసీ డ్రైవర్

By sivanagaprasad kodatiFirst Published Oct 10, 2018, 8:46 AM IST
Highlights

తెలంగాణలో ఘోర బస్సు ప్రమాదం తృటిలో తప్పింది.. ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి నర్సంపేట వెళ్తున్న పరకాల డీపో బస్సు జనగామ వద్ద ప్రమాదానికి గురైంది

తెలంగాణలో ఘోర బస్సు ప్రమాదం తృటిలో తప్పింది.. ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి నర్సంపేట వెళ్తున్న పరకాల డీపో బస్సు జనగామ వద్ద ప్రమాదానికి గురైంది. డ్రైవర్ సాంబయ్యకు నిద్ర ముంచుకురావడంతో డ్రైవింగ్‌పై నియంత్రణ కోల్పోయాడు. ఈ క్రమంలో బస్సును రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను బస్సులోంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. సెప్టెంబర్ నెలలో జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో 62 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

62కు చేరిన కొండగట్టు ప్రమాద మృతుల సంఖ్య

కొండగట్టు ప్రమాదం: స్టీరింగ్ విరిగి... బ్రేకులు ఫెయిలైనా.. డ్రైవర్ చివరి యత్నాలు

కొండగట్టు: ప్రమాదానికి ముందు డ్రైవర్ ఏం చెప్పాడంటే?

కొండగట్టు ప్రమాదాలు: అప్పట్లో వైఎస్, చంద్రబాబు ఇలా...

కొండగట్టు ప్రమాదం: 60 కోతులు చనిపోయిన రెండు రోజులకే ఇలా....

కొండగట్టు ప్రమాదం: 70 కి.మీ స్పీడ్‌తో బస్సు

click me!