ప్రణయ్ పరువు హత్యకేసులో నలుగురు అరెస్ట్

Published : Sep 15, 2018, 07:58 PM ISTUpdated : Sep 19, 2018, 09:26 AM IST
ప్రణయ్ పరువు హత్యకేసులో నలుగురు అరెస్ట్

సారాంశం

మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యలో ఏ1గా ఉన్న అమృత వర్షిణీ తండ్రి మారుతీరావు, ఏ2 బాబాయి శ్రవణ్ తోపాటు ఇద్దరు సుఫారీలను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో అమృతవర్షిణి  తండ్రి ప్రధాన ముద్దాయి మారుతీరావు సంచలన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 

మిర్యాలగూడ: మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యలో ఏ1గా ఉన్న అమృత వర్షిణీ తండ్రి మారుతీరావు, ఏ2 బాబాయి శ్రవణ్ తోపాటు ఇద్దరు సుఫారీలను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో అమృతవర్షిణి  తండ్రి ప్రధాన ముద్దాయి మారుతీరావు సంచలన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 

తొమ్మిదో తరగతి నుంచే ప్రణయ్ తమ కుమార్తె అమృతవర్షిణిని ప్రేమించారని ఎన్నోసార్లు ఇద్దరికి వార్నింగ్ ఇచ్చానని మారుతీరావు పోలీసుల విచారణలో తెలిపారు. తనకు తన కూతురు ప్రేమ కంటే సమాజంలో నా పరువే ముఖ్యం అని భావించానని స్పష్టం చేశాడు. ప్రణయ్ ను హత్య చేయించినందుకు తనకు ఎలాంటి బాధ లేదని స్పష్టం చేశారు. ప్రణయ్ అమృతవర్షిణిల వివాహాన్ని జీర్ణించుకోలేకపోయాన్నారు. ప్రణయ్ ని అంతమెుందించడానికి 10 లక్షలు సుఫారీ కుదుర్చుకున్నానని తెలిపారు. 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా చెల్లించినట్లు తెలిపారు. 

రెండు నెలలుగా ప్రణయ్ నివాసం పరిసర ప్రాంతాల్లో సుఫారీ గ్యాంగ్ రెక్కీ నిర్వహించిందని తెలిపారు.  తన కుమార్తె సేఫ్ గా ఉండటమే తన లక్ష్యమన్న మారుతీరావు తన కుమార్తెకు ఏమీ కాకుండా ప్రణయ్ ను మాత్రమే చంపాలని సుఫారీ గ్యాంగ్ కు చెప్పినట్లు తెలిపారు. తాను జైలుకు వెళ్లడానికి సిద్ధపడే హత్యకు ప్లాన్ చేసినట్లు మారుతీరావు పోలీసుల విచారణలో తెలిపారు.

ఈ వార్తాకథనాలు చదవండి

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్