ఉద్యోగం పేరిట వల.. బంగ్లాదేశ్ యువతులతో వ్యభిచార దందా

By telugu news teamFirst Published Oct 19, 2020, 9:54 AM IST
Highlights

పహాడీషరీఫ్‌ పోలీస్  స్టేషన్‌ పరిధి జల్‌పల్లి, మహమూద్‌ కాలనీలోని రెండు వ్యభిచారగృహాల్లో రాచకొండ పోలీసులు దాడులు చేశారు. నలుగురు బంగ్లాదేశీ యువతులను రెస్క్యూ చేసి.. 10 మందిని అరెస్ట్‌ చేశారు

ఉద్యోగం ఇప్పిస్తామంటూ బంగ్లాదేశ్ యువతులకు ఆశచూపించి హైదరాబాద్ కి తీసుకువచ్చారు. అనంతరం వారి డబ్బు అవసరాన్ని వారికి ఆసరాగా తీసుకొని..  బలవంతంగా వ్యభిచార దందాలోకి దింపారు. కాగా.. ఈ వ్యవభిచార ముఠా గుట్టుని తాజాగా పోలీసులు రట్టు చేశారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న వ్యభిచార దందాని తాజాగా పోలీసులు రట్టు చేశారు. సదరు యువతులను ఉద్యోగం పేరిట ఆశ చూపించి.. అక్రమంగా హైదరాబాద్ నగరానికి తీసుకురావడం గమనార్హం. రుహుల్‌ అమిల్‌ దాలీ, అబ్దుల్‌ బారిక్‌లు.. సోనాయ్‌ నది మీదుగా యువతులను అక్రమంగా భారతదేశంలోకి తీసుకువచ్చినట్లు దర్యాప్తులో తేలింది. 

గత ఏడాది సెప్టెంబరులో పహాడీషరీఫ్‌ పోలీస్  స్టేషన్‌ పరిధి జల్‌పల్లి, మహమూద్‌ కాలనీలోని రెండు వ్యభిచారగృహాల్లో రాచకొండ పోలీసులు దాడులు చేశారు. నలుగురు బంగ్లాదేశీ యువతులను రెస్క్యూ చేసి.. 10 మందిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలు, నకిలీ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కావడంతో ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కేసు నమోదు చేసింది. 10 మందిని నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. ఈ కేసులో శనివారం 12 మందిపై హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో దర్యాప్తు అధికారులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. వారిలో 8 మంది బంగ్లాదేశీయులున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

బంగ్లాదేశీ యువతులను అక్రమంగా భారతదేశంలోకి తీసుకురావడంలో రుహుల్‌ అమీన్‌ దాలిదే కీలకపాత్ర. బంగ్లాదేశ్‌కు చెందిన అబ్దుల్‌బారిక్‌తో చేతులు కలిపి అతడు వ్యభిచార దందాకు తెరలేపాడు. దాలీ, మిగతా నిందితులంతా 1980లో అక్రమంగా బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌దేశంలోకి ప్రవేశించారు. భార్యభర్తలు యూసు్‌ఫఖాన్‌, బీతీ బేగంతో హైదరాబాద్‌, ముంబై తదితర నగరాల్లో వ్యభిచార గృహాలను నిర్వహించేవారు.

అందుకు అందమైన బంగ్లా యువతులను బడా ఉద్యోగాల పేరుతో వలలో లాగేవారు. సోనాయ్‌ నది గుండా నుంచి కోల్‌కతాకు తీసుకువచ్చి.. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేవారు. ఆ తర్వాత వారి పేరుతో నకిలీ గుర్తింపు కార్డులు తీసుకుని.. బలవంతంగా వ్యభిచారం చేయించేవారు. ఈ ఘటన సూత్రధారైన దాలీని ఎన్‌ఐఏ మరో వ్యభిచార కేసులో అరెస్ట్‌ చేసింది.

click me!