హైదరాబాద్ లో హైటెక్ వ్యభిచారం.. బెంగాల్ నుంచి అమ్మాయిలను రప్పించి..

By telugu news teamFirst Published Aug 26, 2020, 8:25 AM IST
Highlights

 అమ్మాయి నచ్చిందని చెప్పిన వారి చేత డబ్బులు కూడా ఆన్ లైన్ లోనే తీసుకొని.. వారి వద్దకు అమ్మాయిలను పంపించేవాడు. వ్యవహారమంతా గుట్టుచప్పుడు కాకుండా ఆన్ లైన్ లోనే నిర్వహించేవాడు.

హైదరాబాద్ నగరంలో హైటెక్ వ్యభిచారం గుట్టుని పోలీసులు రట్టు చేశారు. ఆన్ లైన్ లో వ్యభిచారం నిర్వహిస్తున్న కీసరకు చెందిన వంశీరెడ్డిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి..  పశ్చిమ బెంగాల్ నుంచి అందమైన అమ్మాయిలను నగరానికి రప్పించాడు. అనంతరం వారి చేత బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నాడు.

ఆన్ లైన్ లో అమ్మాయిల ఫోటోలను పెట్టి.. వాటి ద్వారా విటులను ఆకర్షిస్తూ.. తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. బేరం కూడా ఆన్ లైన్ లోనే కుదుర్చుకునేవాడు. కాగా.. అమ్మాయి నచ్చిందని చెప్పిన వారి చేత డబ్బులు కూడా ఆన్ లైన్ లోనే తీసుకొని.. వారి వద్దకు అమ్మాయిలను పంపించేవాడు. వ్యవహారమంతా గుట్టుచప్పుడు కాకుండా ఆన్ లైన్ లోనే నిర్వహించేవాడు.

దీనిపై సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు వీరి స్థావరంపై దాడి చేసి అమ్మాయిలను రక్షించారు. వంశీరెడ్డితో పాటు అంజలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. యువతుల అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరించిన వంశీరెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని రాచకొండ పోలీస్‌ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశించారు. దీంతో పోలీసులు అతడిపై అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు

click me!