అమ్నేషియా పబ్ రేప్ కేసు : ఆ లెవల్స్ ఎక్కువున్నాయ్.. వాళ్లు మైనర్లు కారు, మేజర్లే .. కోర్టులో పోలీసుల పిటిషన్

By Siva Kodati  |  First Published Sep 2, 2022, 4:17 PM IST

 హైదరాబాద్ జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ గ్యాంగ్‌రేప్ కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు మైనర్లను మేజర్లుగా పరిగణించాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ గ్యాంగ్‌రేప్ కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు మైనర్లను మేజర్లుగా పరిగణించాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఐదుగురికి మెచ్యూరిటీ లెవల్స్ ఎక్కువగా వున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. మేజర్‌కు ఉండాల్సిన లక్షణాలన్నీ ఐదుగురికి ఉన్నాయని తెలిపారు. పోలీసుల పిటిషన్‌పై త్వరలో విచారించనుంది కోర్ట్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఇకపోతే.. అమ్నేషియా పబ్ అత్యాచారం కేసుకు సంబంధించి జూలైలో పోలీసులు ఛార్జ్‌షీటు దాఖలు చేశారు. రెండు కోర్టుల్లో ఛార్జ్ షీటు దాఖలు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. 56 రోజుల్లోనే పోలీసులు ఛార్జ్‌షీటు దాఖలు చేయడం విశేషం. జువైనల్ కోర్టుతో పాటు నాంపల్లి కోర్టులో గురువారం ఛార్జ్‌షీట్లు దాఖలు చేశారు పోలీసులు. సాదుద్దీన్‌తో పాటు ఐదుగురు జువైనల్స్‌పై అభియోగాలు నమోదు చేశారు. సాదుద్దీన్‌తో పాటు ఎమ్మెల్యే కుమారుడిపైనా అభియోగాలు మోపారు. ఈ కేసులో మొత్తం 65 మంది సాక్షుల వాంగ్మూలం సేకరించారు. మొత్తం 600 పేజీలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. 

Latest Videos

undefined

ALso REad:Amnesia Pub Rape Case : 56 రోజులు.. 65 మంది సాక్షులు, 600 పేజీలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు

ఎఫ్ఎస్ఎల్, డీఎన్ఏ, సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ రికార్డులు, మెసేజ్‌లు, పొటెన్షివ్ టెస్ట్, సాంకేతిక ఆధారాలను ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచారు. బాలికను ట్రాప్ చేసిన నిందితులు ఆమెపై కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఉద్దేశపూర్వకంగానే బాలికను పబ్‌లో ట్రాప్ చేశారు నిందితులు. తమ కుటుంబాలకు వున్న పలుకుబడిని ఉపయోగించి కేసును తప్పుదారి పట్టించే యత్నం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు జువైనల్స్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. 

click me!