అమ్నేషియా పబ్ రేప్ కేసు : వాళ్లు మైనర్లు కారు, మేజర్లే .. జువైనల్ జస్టిస్ బోర్డ్ సంచలన నిర్ణయం

By Siva Kodati  |  First Published Sep 30, 2022, 5:43 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్ అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో నిందితులుగా వున్న మైనర్లను మేజర్లుగా గుర్తిస్తే జువైనల్ జస్టిస్ బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది.


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్ అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో నిందితులుగా వున్న మైనర్లను మేజర్లుగా గుర్తిస్తే జువైనల్ జస్టిస్ బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది. బహదూర్‌పురా ఎమ్మెల్యే కొడుకును కూడా మేజర్‌గా గుర్తించింది న్యాయస్థానం. మేజర్‌గా గుర్తించి కోర్టులో ట్రయల్స్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. 

ఇకపోతే.. అమ్నేషియా పబ్ అత్యాచారం కేసుకు సంబంధించి జూలైలో పోలీసులు ఛార్జ్‌షీటు దాఖలు చేశారు. రెండు కోర్టుల్లో ఛార్జ్ షీటు దాఖలు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. 56 రోజుల్లోనే పోలీసులు ఛార్జ్‌షీటు దాఖలు చేయడం విశేషం. జువైనల్ కోర్టుతో పాటు నాంపల్లి కోర్టులో గురువారం ఛార్జ్‌షీట్లు దాఖలు చేశారు పోలీసులు. సాదుద్దీన్‌తో పాటు ఐదుగురు జువైనల్స్‌పై అభియోగాలు నమోదు చేశారు. సాదుద్దీన్‌తో పాటు ఎమ్మెల్యే కుమారుడిపైనా అభియోగాలు మోపారు. ఈ కేసులో మొత్తం 65 మంది సాక్షుల వాంగ్మూలం సేకరించారు. మొత్తం 600 పేజీలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. 

Latest Videos

undefined

ALso REad:అమ్నేషియా పబ్ రేప్ కేసు: నిందితుల మొబైల్‌ ఫోన్ల నుంచి డేటాను రికవరీ చేయలేకపోతున్న పోలీసులు..!

ఎఫ్ఎస్ఎల్, డీఎన్ఏ, సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ రికార్డులు, మెసేజ్‌లు, పొటెన్షివ్ టెస్ట్, సాంకేతిక ఆధారాలను ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచారు. బాలికను ట్రాప్ చేసిన నిందితులు ఆమెపై కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఉద్దేశపూర్వకంగానే బాలికను పబ్‌లో ట్రాప్ చేశారు నిందితులు. తమ కుటుంబాలకు వున్న పలుకుబడిని ఉపయోగించి కేసును తప్పుదారి పట్టించే యత్నం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు జువైనల్స్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

click me!