ఖమ్మం: అజయ్‌కు సవాల్ విసురుతున్న నామా

By narsimha lodeFirst Published Nov 19, 2018, 2:42 PM IST
Highlights

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో  ఉద్దండుల మధ్య పోటీ నెలకొంది. 


హైదరాబాద్: ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో  ఉద్దండుల మధ్య పోటీ నెలకొంది.  ఖమ్మం మాజీ ఎంపీ  నామా నాగేశ్వరరావు ఈ దఫా టీడీపీ అభ్యర్థిగా  ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన  అజయ్‌ కుమార్ ఈ దఫా  టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆర్థికంగా ఇద్దరూ కూడ హేమా హేమీలే. దీంతో   ఈ నియోజకవర్గంలో  పోటీపై  ఆసక్తి నెలకొంది.

2009 అసెంబ్లీ ఎన్నికల్లో  ఖమ్మం అసెంబ్లీ స్తానం నుండి తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 లో ఇదే స్థానం నుండి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి  ఓటమి పాలయ్యారు.  

అయితే ఆ తర్వాత  చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో   తుమ్మల నాగేశ్వరరావు టీడీపీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరారు. కేసీఆర్ మంత్రివర్గంలో  మంత్రిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పాలేరు నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో తుమ్మల పోటీ చేసి విజయం సాధించారు. 

ప్రస్తుతం పాలేరు నుండి తుమ్మల టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. పాలేరు ఉప ఎన్నిక సందర్భంగానే  అజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు.

తుమ్మల నాగేశ్వరరావు టీడీపీని వీడడంతో  ఆయనతో పాటు ఆయన వర్గీయులంతా  టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ నుండి  నామా నాగేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. టీఆర్ఎస్‌ నుండి అజయ్ కుమార్  పోటీ చేస్తున్నారు. రెండేళ్ల కిందట జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల వరకూ ఇక్కడ కాంగ్రెదే పట్టు. ఆ ఎన్నికల్లో మంత్రి తుమ్మల చక్రం తిప్పడంతో మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ వశమైంది. 

ఖమ్మం పట్టణంలో చేపట్టిన వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు  తనను  గెలిపిస్తాయని  టీఆర్ఎస్ అభ్యర్థి అజయ్ కుమార్ ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ ఓటు బ్యాంకు తనను గెలిపిస్తోందని  టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు  విశ్వాసంతో ఉన్నారు. బరిలో ఉన్న ఈ ఇద్దరూ నేతలు కూడ  ఆర్థికంగా  ఉన్నవారే.  దీంతో   ఓటర్లను  తమ వైపుకు తిప్పుకొనేందుకు  ప్రయత్నాలు  ఎక్కువగా ఉండే అవకాశం లేకపోలేదని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి  పోటీ చేయాలని నామా నాగేశ్వరరావు భావించారు.కానీ, పార్టీ అవసరాల రీత్యా అసెంబ్లీకే పోటీ చేయాలని  చంద్రబాబునాయుడు  నామా నాగేశ్వరరావును ఆదేశించారు. దీంతో ఆయన ఖమ్మం నుండి  టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగారు.

అజయ్  తండ్రి  పువ్వాడ నాగేశ్వరరావు ప్రముఖ సీపీఐ నేత.  గతంలో ఖమ్మం నుండి పువ్వాడ నాగేశ్వరరావు సీపీఐ అభ్యర్థిగా ప్రాతినిథ్యం వహించారు.  గత ఎన్నికల్లో  అజయ్ విజయంలో  పువ్వాడ కీలకపాత్ర పోషించారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.అయితే  ప్రస్తుతం ప్రజా కూటమిలో సీపీఐ భాగస్వామిగా ఉంది.ఈ పరిస్థితుల నేపథ్యంలో సీపీఐ  టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు సహకరించాల్సిన  పరిస్థితులు నెలకొన్నాయి.

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో 2.15 లక్షల ఓటర్లు ఉన్నారు. అయితే ఖమ్మంలోనే  సుమారు 2.15 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఖమ్మం కార్పోరేషన్ లో  50 డివిజన్లు ఉంటే వాటిలో 34 డివిజన్లు టీఆర్ఎస్ ఆధీనంలో ఉన్నాయి. 

 ఆ తర్వాత 9 మంది  టీఆర్ఎస్ లో చేరారు.  ఇద్దరూ కూడ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే. ఖమ్మం పట్టణంలో సుమారు 38 వేల మైనార్టీ ఓట్లు ఉంటాయి.  మైనార్టీ ఓట్లను  ఆకర్షించేందుకు  ఇద్దరూ నేతలు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కమ్మ సామాజిక వర్గానికి సుమారు 45 వేల ఓట్లు ఉన్నాయి.  పోటీలో ఉన్న వారిద్దరూ కూడ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే కావడంతో  ఈ ఓట్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

దిమ్మతిరిగే కౌంటరిచ్చిన సుహాసిని: కూకట్‌పల్లి నుండి పోటీకి కారణమిదే

సుహాసినీ కోసం.. రంగంలోకి ఎన్టీఆర్

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి సుహాసిని ఆస్తులివే

కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సుహాసిని

సుహాసినికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంపై స్పందించిన బాలయ్య

ఎన్టీఆర్‌‌కు నివాళులర్పించిన నందమూరి సుహాసిని

బరిలోకి సుహాసిని: తెర వెనక భువనేశ్వరి

మాధవరం తెలుగుదేశం ద్రోహి, అతన్ని ఓడిస్తా.. సుహాసిని నా బిడ్డ: పెద్దిరెడ్డి

అందుకే రాజకీయాల్లోకి వచ్చా, తండ్రిని తల్చుకొని కన్నీళ్లు పెట్టుకొన్న సుహాసిని

హరికృష్ణ సానుభూతి, ఎన్టీఆర్ ఛరిష్మా: టీడీపీ తురుపుముక్క సుహాసిని

నందమూరి సుహాసినీపై.. మిత్రపక్షం కాంగ్రెస్ తిరుగుబాటు

కూకట్‌పల్లి సుహాసినికి కేటాయింపు: బాబు వద్దకు పెద్దిరెడ్డి

 

 

 

 

click me!
Last Updated Nov 19, 2018, 2:43 PM IST
click me!