బండ్ల గణేష్ కి టికెట్ ఇవ్వకున్నా.. పదవి ఇచ్చిన కాంగ్రెస్

Published : Nov 19, 2018, 01:45 PM IST
బండ్ల గణేష్ కి టికెట్ ఇవ్వకున్నా.. పదవి ఇచ్చిన కాంగ్రెస్

సారాంశం

బండ్ల గణేష్ కి కాంగ్రెస్ పార్టీ కీలక పదవి కట్టబెట్టింది. 

సినీ నిర్మాత, వ్యాపారవేత్త బండ్ల గణేష్ కి కాంగ్రెస్ పార్టీ కీలక పదవి కట్టబెట్టింది. ఇటీవల బండ్ల గణేష్.. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ లో రాహుల్ గాంధీని కలిసి.. ఆయన సమక్షంలో బండ్ల పార్టీలో చేరారు.

పార్టీలో చేరిన వెంటనే.. ఓ మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు రాజేంద్రనగర్ టికెట్ దక్కడం ఖయమని చెప్పుకున్నారు. అక్కడితో ఆగలేదు. తాను గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ.. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం కూడా ప్రాక్టీస్ చేశారు.

సీన్ కట్ చేస్తే.. ఇటీవల కాంగ్రెస్ విడుదల చేసిన జాబితాలో.. బండ్లకు చోటు దక్కలేదు. ఆయన ఆశించిన రాజేంద్ర నగర్ సీటు.. పొత్తులో భాగంగా టీడీపీకి దక్కింది. దీంతో.. ఒక్కసారిగా బండ్ల గణేష్ డీలా పడిపోయాడు.

అయితే.. వెంటనే స్పందించిన కాంగ్రెస్ అదిష్టానం.. బండ్లను బుజ్జగించే పని మొదలుపెట్టింది. ఈ మేరకు పార్టీ టికెట్ ఇవ్వకున్నా.. ఓ ప్రముఖ పదవిని కట్టబెట్టింది. బండ్ల గణేష్ ని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా నియమిస్తూ.. ఉత్వర్వులు జారీ చేసింది. ఈ లెటర్ ని బండ్ల గణేష్ కి కూడా పంపించారు. దీంతో.. టికెట్ దక్కకున్నా.. పార్టీలో కీలకపదవి దక్కినందుకు ఫుల్ ఖుషీగా ఉన్నారట. 

PREV
click me!

Recommended Stories

Richest District : ఇండియాలో రిచెస్ట్ జిల్లా ఏదో తెలుసా? ముంబై, ఢిల్లీ కానే కాదు !
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో జల్లులు