పాపం నాయిని.. తన చేతులతో ముఠాకి బీ-ఫారం

By ramya neerukondaFirst Published Nov 19, 2018, 2:14 PM IST
Highlights

ఈ స్థానంలో తన అల్లుడిని బరిలోకి దించేందుకు నాయిని పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. కేసీఆర్‌ నచ్చజెప్పడంతో నాయిని వెనక్కితగ్గారు.

తీవ్ర ఉత్కంఠ రేపిన ముషీరాబాద్ టికెట్ ని పార్టీ అధిష్టానం ముఠా గోపాల్ కి కేటాయించింది. ఈ టికెట్ విషయంలో నాయిని భంగపాటు ఎదురైంది. ఆ టికెట్ ని తన అల్లుడికి కేటాయించాలని నాయిని.. ఎప్పటి నుంచో కేసీఆర్ ని కోరుతున్నారు. కానీ.. అనూహ్యంగా ఆ టికెట్ ని ముఠా గోపాల్ కి కేటాయించారు.

అయితే.. తన అల్లుడికి టికెట్ ఇవ్వలేదన్న బాధను పక్కనపెట్టి మరీ పార్టీ నిర్ణయానికే తలొగ్గారు. ఈ రోజు ఉదయం ముఠా గోపాల్ కి నాయిని స్వయంగా తన చేతులతో భీ-ఫారం అందించారు. 

మొత్తం 119 స్థానాలకు గాను  టీఆర్ఎస్ పార్టీ  శనివారం వరకు  రెండు స్థానాలను పెండింగ్ లోనే ఉంచింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నవారివైపు అధిష్ఠానం మొగ్గు చూపింది. కోదాడకు బొల్లం మల్లయ్య యాదవ్‌, ముషీరాబాద్‌కు ముఠాగోపాల్‌ను ఖరారు చేస్తూ కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. 

ఈ క్రమంలోనే వీరి పేర్లను ఆదివారం అధికారికంగా ప్రకటించారు. బర్కత్‌పురలో నాయిని చేతుల మీదుగా ముఠాగోపాల్ బి-ఫారం అందుకున్నారు. అయితే ఈ స్థానంలో తన అల్లుడిని బరిలోకి దించేందుకు నాయిని పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. కేసీఆర్‌ నచ్చజెప్పడంతో నాయిని వెనక్కితగ్గారు.

ఇవి కూడా చదవండి

నాయినికి షాక్: ముషీరాబాద్‌ ముఠా గోపాల్‌కు, కోదాడ బొల్లందే

నాయిని మొండిపట్టు: కేసీఆర్ కు తలనొప్పి ఇదీ...

అల్లుడికి హమీ ఇచ్చారు, ఆ సీటు నాకే కావాలి: నాయిని

click me!