విశ్వేశ్వర రెడ్డి వ్యాఖ్యలను తిప్పికొట్టిన జితేందర్ రెడ్డి

By pratap reddyFirst Published Nov 26, 2018, 2:15 PM IST
Highlights

విశ్వేశ్వర రెడ్డి తనకు మంచి మిత్రుడని జితేందర్ రెడ్డి సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పార్టీ మారే ముందు తాను విశ్వేశ్వర రెడ్డితో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే విశ్వేశ్వర రెడ్డి టీఆర్ఎస్ పార్టీని వీడారని ఆయన అన్నారు 

హైదరాబాద్: తనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర రెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి తిప్పికొట్టారు. టీఆర్ఎస్ లో జితేందర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని విశ్వేశ్వర రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 

విశ్వేశ్వర రెడ్డి తనకు మంచి మిత్రుడని జితేందర్ రెడ్డి సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పార్టీ మారే ముందు తాను విశ్వేశ్వర రెడ్డితో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే విశ్వేశ్వర రెడ్డి టీఆర్ఎస్ పార్టీని వీడారని ఆయన అన్నారు 

తాజా మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి, విశ్వేశ్వర రెడ్డికి మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తగాదాలు వచ్చాయని, ఆ విషయంలో పార్టీ జోక్యం చేసుకోలేదని ఆయన అన్నారు. తాను పార్టీ మారబోనని, విశ్వేశ్వర రెడ్డి మతి తప్పి మాట్లాడుతున్నారని జితేందర్ రెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

మిగిలిన ఎంపీలు కూడా వచ్చేస్తారు: విశ్వేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్య

విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా: కాంగ్రెస్‌కు కలిసొచ్చిన వరం

కేసీఆర్‌కు బిగ్ షాక్: టీఆర్ఎస్‌కు ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా

కేసీఆర్ కు షాక్: కాంగ్రెసులోకి ఎంపీ విశ్వేశ్వర రెడ్డి?

ఆ ఆలోచన లేదు: కేసీఆర్ తో భేటీ తర్వాత విశ్వేశ్వర రెడ్డి

రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు: టీఆర్ఎస్ ఎంపీ

కాంగ్రెస్ లోకి ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు:టచ్ లో ఉన్నారన్న రేవంత్

2నెలల ముందే విశ్వేశ్వరరెడ్డి రాజీనామాకు స్కెచ్

రేవంత్ మాట నిజమే,టీఆర్ఎస్ ఫస్ట్ వికెట్ డౌన్

click me!