‘50వేల మెజార్టీ తగ్గితే’... ఉత్తమ్ సవాల్

By ramya neerukondaFirst Published Nov 26, 2018, 2:09 PM IST
Highlights

తెలంగాణలో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనకు 50వేల మెజార్టీ కచ్చితంగా వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

తెలంగాణలో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనకు 50వేల మెజార్టీ కచ్చితంగా వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలా కనుక రాకపోతే.. తాను గెలిచినప్పటికీ.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ విసిరారు.

ఉత్తమ్.. హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. కాగా.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే హుజూర్‌నగర్‌ నియోజకవర్గ కేంద్రంలోని మట్టపల్లి క్షేత్రం కేంద్రంగా వేయి కోట్లతో టూరిజం ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేస్తానన్నారు. నాగార్జునసాగర్‌ టూరిజం ప్రాజెక్ట్‌ను తలదన్నేలా మట్టపల్లి ప్రాంతాన్ని సుందర రూపంగా తీర్చిదిద్దుతానన్నారు.
 
హుజూర్‌నగర్‌ను ఎంతో అభివృద్ధి చేశానన్నారు. మంత్రి చెంచాలు, అనుచరులు, బంధువర్గం పేరుతో దందా చేయాలని చూస్తే సహించరన్నారు. కలెక్టరేట్‌ భూముల కుంభకోణాల్లో నిందితులు ప్రజల మనసులను గెలవలేరన్నారు. అనంతరం.. టీఆర్ఎస్ లో టికెట్ ఆశించి భంగపడిన పలువురు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 

click me!