కమలాపూర్ లో కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసిన ఈటల (వీడియో)

Dec 7, 2018, 4:04 PM IST

ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడిన ఈటల. ఆంధ్ర మీడియా, సోషల్ మీడియా, యెల్లో మీడియా ఎంత దుష్పచారం చేసిన తెలంగాణ ప్రజలు న్యాయం వైపు, ధర్మం వైపు ఉన్నారని  అన్నారు. పోలింగ్ సరళి చుస్తే ఆలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు.. ముథోల్ నుండి భద్రాచలం వరకు కారు జోరు కొనసాగుతుందని అన్నారు. మాకు మద్దతు తెలపడం ద్వారా ప్రజలు తమ భాద్యతను, జిమ్మేదారితనాన్ని మరింత పెంచారని  అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన వాటిని చేదించి తెలంగాణ సాదించు కున్నం. ఈ  రోజు కూడా తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేస్తూ కెసిఆర్ గారికి ఓటు వేస్తున్నదుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఋణం తీర్చుకుంటామనిా అన్నారు. అందరూ చల్లగా ఉండేలా పనిచేస్తామని అన్నారు ఈటల.