తిరుగులేని ముహూర్తం: నామినేషన్ వేసి...కేసీఆర్ ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారా..?

By sivanagaprasad kodatiFirst Published Nov 14, 2018, 9:25 AM IST
Highlights

తెలంగాణ ఎన్నికల్లో అందరికన్నా ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో పాటు... ప్రచారంలోనూ దూసుకెళ్తోంది తెలంగాణ రాష్ట్ర సమితి. 107 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి.. మిగిలిన 12 స్థానాలను ఎవరిని ఇస్తారనే దానిపై క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్‌లో ఉంచారు టీఆర్ఎస్ చీఫ్.

తెలంగాణ ఎన్నికల్లో అందరికన్నా ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో పాటు... ప్రచారంలోనూ దూసుకెళ్తోంది తెలంగాణ రాష్ట్ర సమితి. 107 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి.. మిగిలిన 12 స్థానాలను ఎవరిని ఇస్తారనే దానిపై క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్‌లో ఉంచారు టీఆర్ఎస్ చీఫ్.

కాంగ్రెస్ జాబితా ప్రకటించాకా.. తమ ఫైనల్ లిస్ట్ ప్రకటించాలనుకున్నారు కేసీఆర్. ఈ క్రమంలో హస్తం తన తొలి జాబితాను కూడా ప్రకటించడంతో పార్టీ శ్రేణుల నుంచి టీఆర్ఎస్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఇవాళ కేసీఆర్ నామినేషన్ వేయనుండటంతో తుది జాబితా కూడా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.

అందుకు కారణం ఈ రోజు ముహూర్త బలం బాగుండటమేనట. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మకలర లగ్నం ఉంటుంది... మధ్యాహ్నం 1.30 నుంచి 2.50 వరకు కుంభలగ్నం ఉంటుంది..

ఈ రెండు ముహూర్తాల్లోనే కేసీఆర్, హరీశ్‌తో పాటు టీఆర్ఎస్‌కు చెందిన మొత్తం 42 మంది అభ్యర్థులు బుధవారమే నామినేషన్లు దాఖలు చేయనున్నారు. దానికి తోడు టికెట్ కోసం వేచి చూస్తోన్న కొందరికి టీఆర్ఎస్ హైకమాండ్ నుంచి సమాచారం సైతం అందిందట. అందువల్ల టీఆర్ఎస్ తుది జాబితా కూడా ఇవాళే ప్రకటిస్తారని ఆశావహులు బలంగా నమ్ముతున్నారు. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే కొద్ది గంటలు వేచి చూడాల్సిందే. 

తిరుగులేని ముహుర్తంలో కేసీఆర్ నామినేషన్: ఇక రాజయోగమేనా

కేసీఆర్ కోట: గజ్వెల్ సీటు చరిత్ర, సెంటి మెంట్ ఇదీ....

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత

రేపే సీఎం కేసీఆర్ నామినేషన్...కేసీఆర్, హరీశ్‌రావులపై కేసులు ఎత్తివేత

ఆ 12 సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే: ఉత్తమ్‌ను ఢీకొనేది అతనే

కేసీఆర్ బీ-ఫారం సెంటిమెంట్... ఈసారి వర్కౌట్ అవుతుందా..?

గజ్వేల్ అభివృద్ధి ఆగిపోవాలని హరీష్ అనుకుంటున్నాడు: కేసీఆర్

''కేసీఆర్‌తో కాంగ్రెస్ సీనియర్లు కుమ్మక్కు...అందువల్లే డమ్మీలకు సీట్లు''

click me!
Last Updated Nov 14, 2018, 9:25 AM IST
click me!