బిజెపి అంటే ‘బలాత్కార్ జస్టిఫికేషన్ పార్టీ’... బిల్కిస్ బానో దోషితో వేదిక పంచుకోవడంపై..కేటీఆర్

By SumaBala BukkaFirst Published Mar 27, 2023, 1:53 PM IST
Highlights

బీజేపీనేతలతో బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషులు వేదిక పంచుకోవడం మీద దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  

హైదరాబాద్ : బిజెపిపై బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బిజెపి అంటే బలాత్కార్ జస్టిఫికేషన్ పార్టీ అంటూ  వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఎద్దేవా చేశారు. బిల్కీస్ భానో కేసు దోషులతో పాటు బిజెపి నేతలు సన్నిహితంగా ఉండడాన్ని.. ఆ పార్టీ విధానాన్ని తెలుపుతుందని అన్నారు. అంతేకాదు బిల్కీస్ భానో కేసులో దోషులు జైలు నుంచి విడుదలైనప్పుడు బిజెపి నేతలు వారిని సత్కరించారని, సంబరాలు చేసుకున్నారని గుర్తు చేశారు. అలా బయటకు వచ్చిన వారు ఇప్పుడు బిజెపి ప్రజా ప్రతినిధులతో పాటు ఒకే వేదికను పంచుకుంటున్నారని మండిపడ్డారు.  ఈ మేరకు ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్ ను కేటీఆర్ రిపీట్ చేశారు.

శనివారం గుజరాత్లో ఓ ప్రభుత్వ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వారితో పాటు బిల్కీస్ బానో కేసు దోషుల్లో ఒకరైన చిమన్ లాల్ భట్ కూడా ఈ కార్యక్రమంలో ఒకే వేదిక మీద పాల్గొన్నారు. గుజరాత్ లోని దాహోదు జిల్లా కర్మాడి గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది. అక్కడి బిజెపి ఎంపీ ఎమ్మెల్యేలతో కలిసి చిమన్లాల్ భట్ వేదికపై ఉన్నాడు. ఈ సందర్భంగా చేసిన పూజా కార్యక్రమంలో కూడా అతను పాల్గొన్నాడు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఎమ్మెల్యే, ఎంపీలు తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

బీజేపీ శాసనసభ్యులతో వేదిక పంచుకున్న బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషులు.. స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం

ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో దేశవ్యాప్తంగా వీటి మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేటీఆర్ కూడా ట్విట్టర్ లో ఈ ఫోటోలోని విమర్శిస్తూ ఆ పార్టీపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. నిరుడు ఆగస్టు 15 సందర్భంగా గుజరాతి ప్రభుత్వం బిల్కీస్ బానో కేసులో దోషులుగా ఉన్న 11 మందిని రెమిషన్ మీద విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.  తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.  రెమిషన్ మీద వీరిని ఎలా విడుదల చేస్తారంటూ సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలయింది. దీనిమీద సుప్రీంలో విచారణ కొనసాగుతోంది.

click me!