డ్రగ్స్‌ నిర్మూలన: ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష

By narsimha lodeFirst Published Oct 20, 2021, 3:12 PM IST
Highlights

డ్రగ్స్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. ఎక్సైజ్, పోలీసు శాఖల ఉన్నతాధికారులు  ఈ సమావేశంలో పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్దాలను పోలీసులు సీజ్ చేశారు.  రాష్ట్రంలో సుమారు 150కిపైగా కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్: డ్రగ్స్‌  నిర్మూలన కోసం తెలంగాణ సీఎం kcr ఉన్నతాధికారులతో బుధవారం నాడు సమావేశమయ్యారు.డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ  ఉండేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. ఇటీవల కాలంలో  తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్దాలను పోలీసులు సీజ్ చేశారు.  రాష్ట్రంలో సుమారు 150కిపైగా కేసులు నమోదయ్యాయి.

also read:డ్రగ్స్‌పై ఉక్కుపాదం: ఈ నెల 20న ఎక్సైజ్,పోలీసులతో కేసీఆర్ భేటీ

రాష్ట్రం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేకాల క్లబ్‌లను ఉక్కుపాదంతో అణచివేశారు. అదే తరహలో డ్రగ్స్ పై చర్యలు తీసుకోవాలని కేసీఆర్ సర్కార్ భావిస్తోంది.

తెలంగాణలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది.అయితే ఈ కేసులో ఎక్సైజ్ శాఖ విచారణ నిర్వహించిన టాలీవుడ్ ప్రముఖులకు ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది. మరో వైపు సినీ ప్రముఖులను ఈడీ అధికారులు ఇటీవలనే విచారించారు.

ఈ స‌మావేశంలో హోంమంత్రి మ‌హ‌ముద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, హోం, ఎక్సైజ్‌ శాఖల ప్రధాన కార్యదర్శులు, శాంతిభద్రతల అడిషనల్‌ డీజీ జితేందర్‌, ఇంటలిజెన్స్‌ అడిషనల్‌ డీజీ అనిల్‌కుమార్‌, జోనల్‌ ఐజీలు, డీఐజీలు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు, ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్‌ కమిషనర్లు, జిల్లా సూపరింటెండెంట్లు, రాష్ట్ర మాదకద్రవ్యాల ప్రత్యేక టాస్‌ ఫోర్స్‌ అధికారులు హాజ‌ర‌య్యారు.
 

click me!