హరికృష్ణ నివాసంలో కలుసుకున్న ఇద్దరు చంద్రులు

Published : Aug 29, 2018, 03:58 PM ISTUpdated : Sep 09, 2018, 11:14 AM IST
హరికృష్ణ నివాసంలో కలుసుకున్న ఇద్దరు చంద్రులు

సారాంశం

రోడ్డు ప్రమాదంలో మరణించిన సినీనటుడు, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ భౌతిక కాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. 

రోడ్డు ప్రమాదంలో మరణించిన సినీనటుడు, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ భౌతిక కాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. నార్కెట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రి నుంచి హరికృష్ణ భౌతికకాయాన్ని రోడ్డుమార్గం ద్వారా మెహదీపట్నంలోని ఆయన నివాసానికి తరలించారు.

సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారులతో కలిసి హరికృష్ణ నివాసానికి చేరుకుని నివాళుర్పించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి తిరిగి కాన్వాయ్ వద్దకు చేరుకుని కాసేపు ముచ్చటించారు.

ఈ సందర్భంగా హరికృష్ణ అంత్యక్రియలపై మంత్రి తలసానికి కేసీఆర్ సూచనలిచ్చారు. కుటుంబసభ్యులు ఎక్కడ కోరితే అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తామని తలసాని అన్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో అంత్యక్రియలు ఎక్కడ జరపాలన్న దానిపై హరికృష్ణ కుటుంబసభ్యులతో మంత్రి కేటీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు.

సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి:

కొడుకు కోరిక తీరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారు!

తండ్రిలాగే జోలెపట్టి విరాళాలు సేకరించిన హరికృష్ణ

హిందూపురంతో హరికృష్ణ బంధం ఇదీ...

హరికృష్ణ మృతిపై క్రిష్ ఎమోషనల్ పోస్ట్!

హరికృష్ణ: రోజులో ఎక్కువ టైమ్ 1001 రూమ్‌లోనే, ఎందుకంటే?

హరికృష్ణ మోసపోయారు.. పోసాని సంచలన కామెంట్స్!

PREV
click me!

Recommended Stories

దుమ్ములేపే స్పీచ్ CM Revath Reddy Next Level Speech At Teachers Day Meeting | Asianet Telugu
Rapido: ర్యాపిడో ఉప‌యోగించే మ‌హిళ‌ల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. అందుబాటులోకి కొత్త స‌ర్వీస్‌