ఆ... చైతన్య రథంపైనే హరికృష్ణ అంతిమయాత్ర

Published : Aug 29, 2018, 03:47 PM ISTUpdated : Sep 09, 2018, 01:11 PM IST
ఆ... చైతన్య రథంపైనే హరికృష్ణ  అంతిమయాత్ర

సారాంశం

ఆ చైతన్య రథానికి అప్పుడు హరికృష్ణే సారథిగా వ్యవహరించారు. ఇప్పుడు అదే రథంపై హరికృష్ణ అంతిమయాత్ర నిర్వహించాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని రామక‌ృష్ణ సినీ స్టూడియోలో ఉన్న చైతన్యరథాన్ని అంతిమయాత్రకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 

సినీనటుడు, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ మృతి తెలుగు రాష్ట్రాల ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్ నుంచి నెల్లూరుకి స్నేహితుడి కుమారుడి పెళ్లికి వెళుతుండగా.. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. తీవ్రగాయాలపాలైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొద్ది సేపటి క్రితమే ఆయన మృతదేహం మెహదీపట్నంలోని హరికృష్ణ నివాసానికి చేరుకుంది.

కాగా.. రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన అంత్యక్రియలు అందరికీ గుర్తుండేలా చేయాలని ఆయన కుమారులు భావిస్తున్నారు. అందుకే 1983 నాటి చైతన్య రథంపై హరిక‌ృష్ణ అంతిమయాత్ర నిర్వహించాలని కుటుంబసభ్యులు సన్నాహాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దివంగత సీఎం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 1983లో రాష్ట్రమంతటా ప్రచారం నిర్వహించిన చైతన్య రథంపై హరిక‌ృష్ణ అంతిమయాత్ర నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. 

అప్పట్లో తండ్రి ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి అన్నీ తానై నడిపించారు హరికృష్ణ.  ఆ చైతన్య రథానికి అప్పుడు హరికృష్ణే సారథిగా వ్యవహరించారు. ఇప్పుడు అదే రథంపై హరికృష్ణ అంతిమయాత్ర నిర్వహించాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని రామక‌ృష్ణ సినీ స్టూడియోలో ఉన్న చైతన్యరథాన్ని అంతిమయాత్రకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌