హరికృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన కేసీఆర్

By Arun Kumar PFirst Published Aug 29, 2018, 3:52 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని హరికృష్ణ నివాసానికి చేరుకుని ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కేసీఆర్ వెంట డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు జగదీశ్‌రెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు ప్రముఖులు హరికృష్ణ మృతదేహాన్ని సందర్శించారు.

తెలుగు సినీ నటుడు, టిడిపి మాజీ ఎంపి నందమూరి హరికృష్ణ ఇవాళ తెల్లవారుజామున నల్గొండ జిల్లా రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ లోని ఆయన స్వగృహానికి తరలించారు. దీంతో ఆయన నివాసానికి ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు చేరుకుని మృతదేభహానికి నివాళులు అర్పిస్తున్నారు. 

ఏపి సీఎం చంద్రబాబు అమరావతి నుండి నేరుగా నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రికి చేరుకుని నందమూరి హరికృష్ణ మృతదేహాన్ని సందర్శించారు. పోస్టు మార్టం జరిగేంత వరకు అక్కడే వుండి  మృతదేహంతో పాటే హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన హరికృష్ణ ఇంటివద్దే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.  

ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హైదరాబాద్ లోని హరికృష్ణ నివాసానికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అక్కడే వున్న ఏపి సీఎం చంద్రబాబును కలిసి అభివాదం చేయడంతోపాటు కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం కేసీఆర్ హరికృష్ణ కుటుంబసభ్యులను పరామర్శించారు. కేసీఆర్ వెంట డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు జగదీశ్‌రెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు ప్రముఖులు హరికృష్ణ మృతదేహాన్ని సందర్శించారు.
 

click me!