కారు లేని కేసీఆర్, కొడుకు వద్ద అప్పు

By ramya neerukondaFirst Published Nov 15, 2018, 11:25 AM IST
Highlights

కేసీఆర్.. తన సొంత కుమారుడు కేటీఆర్ కి అప్పుపడ్డాడు. మీరు చదివింది నిజమే.. ఈ విషయాన్ని కేసీఆర్ స్వయంగా వెల్లడించారు.


తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్.. తన సొంత కుమారుడు కేటీఆర్ కి అప్పుపడ్డాడు. మీరు చదివింది నిజమే.. ఈ విషయాన్ని కేసీఆర్ స్వయంగా వెల్లడించారు.

ఇంతకీ మ్యాటరేంటంటే.. బుధవారం గజ్వేల్ నియోజకవర్గానికి కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. కాగా.. అఫిడవిట్ లో ఆయన తన ఆస్తులు, అప్పుల వివరాలను పొందుపరిచారు. అందులో తాను తన కొడుకు, కోడలికి అప్పు ఉన్నట్లు పేర్కొనడం గమనార్హం.

అఫిడవిట్ ప్రకారం కేసీఆర్ మొత్తం ఆస్తుల విలువ రూ.22.60 కోట్లుగా పేర్కొన్నారు.  వీటిలో చరాస్తులు రూ.10.40కోట్లు,  స్థిరాస్తులు రూ.12.20 కోట్లుగా పేర్కొన్నారు. ఇకపోతే కేసీఆర్ వద్ద నగదు రూపంలో రూ.2 లక్షల 40వేలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తనకు సొంత కారు కూడా లేదని అఫిడవిట్ లో కేసీఆర్ పొందుపరిచారు. 

ఆయన  భార్య శోభ పేరిట రూ.93 వేల నగదు, 2.2 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వీటి విలువ రూ.94.59 లక్షలుగా పేర్కొన్నారు. గతంతో పోలిస్తే కేసీఆర్‌కు అప్పులు మరో రూ.కోటి పెరిగి, రూ.8.88కోట్లకు చేరినట్లు పేర్కొన్నారు.

తన కొడుకు కేటీఆర్‌ వద్ద నుంచి రూ.82లక్షలు, కోడలు శైలిమ నుంచి రూ.24.65 లక్షలు అప్పు  తీసుకున్నట్లు కేసీఆర్ తెలిపారు.  2014 ఎన్నికల సమయంలో రూ.15.15కోట్ల విలువైన స్థిర, చరాస్తులు, రూ.7.87 కోట్ల అప్పులు ఉన్నాయని ప్రమాణ పత్రంలో చూపించారు. గత రెండేళ్లలో భార్య శోభ పేరిట 6.24 ఎకరాల వ్యవసాయభూమి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.

కేసీఆర్ కి గజ్వేల్ లో ఫామ్ హౌస్ ఉందన్న విషయం తెలిసిందే. ఆ ఫామ్ హోస్ కోసం రూ. 3.19 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ఆయన అఫిడవిట్ లో పేర్కొన్నారు. 

read more news

కేసీఆర్ ఆస్తులెంతో తెలుసా...

గజ్వేల్ నుండి కేసీఆర్ నామినేషన్ దాఖలు

నేను ఏ యుద్ధంలోనూ ఓడిపోలేదు: కేసీఆర్

అదే సెంటిమెంట్: నామినేషన్ పత్రానికి కేసీఆర్ ప్రత్యేక పూజలు

తిరుగులేని ముహుర్తంలో కేసీఆర్ నామినేషన్: ఇక రాజయోగమేనా

కేసీఆర్ కోట: గజ్వెల్ సీటు చరిత్ర, సెంటి మెంట్ ఇదీ....

click me!