హరీష్ రావు: లక్షల అధికారి నుంచి కోటీశ్వరుడిగా...

By pratap reddyFirst Published Nov 15, 2018, 11:01 AM IST
Highlights

కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొందిన హరీష్ రావుపై మూడు కేసులు పెండింగులో ఉన్నాయి. ఏ కేసులోనూ ఆయనకు శిక్ష పడలేదు. 

హైదరాబాద్: గత నాలుగున్నరేళ్లలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సిద్ధిపేట అభ్యర్థి, ఆపద్ధర్మ మంత్రి టి. హరీష్ రావు ఆస్తులు 6.5 రెట్లు పెరిగాయి. 2014 ఎన్నికల సమయంలో ఆయన భూములు, ఆభరణాల విలువ రూ. 45 లక్షలు ఉండగా అవి ప్రస్తుతం రూ.3.46 కోట్లకు చేరుకున్నాయి. బుధవారం ఆయన సిద్ధిపేట శాసనసభ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేశారు. 

నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన 19 పేజీల అఫిడవిట్ లో ఆయన తన ఆస్తుల వివరాలను పొందుపరిచారు. దాని ప్రకారం ఆయనకు చరాస్తులు కోటి రూపాయల మేరకు ఉండగా, స్థిరాస్తులు రూ.3.46 కోట్లు ఉన్నాయి. మొత్తం ఆయన ఆస్తుల విలువ రూ.3.90 కోట్లు.

రైతునైన తనకు వ్యవసాయం ద్వారా రూ.1.26 లక్షల రూపాయల ఆదాయం ఉందని చెప్పారు. ఆయన 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.19.13 లక్షల ఆదాయం పన్ను చెల్లించారు. 

గత నాలుగున్నరేళ్లలో తాను రూ.3 కోట్ల మేర వ్యవసాయేతర భూములపై పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. ఆయన రూ.25 లక్షలు బ్యాంకులకు బాకీ ఉన్నారు. 

కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొందిన హరీష్ రావుపై మూడు కేసులు పెండింగులో ఉన్నాయి. ఏ కేసులోనూ ఆయనకు శిక్ష పడలేదు. 

click me!