హెటిరో డ్రగ్స్ సంస్థల్లో భారీగా నగదు సీజ్: బీరువాల్లో కరెన్సీ కట్టలు

By narsimha lodeFirst Published Oct 11, 2021, 5:32 PM IST
Highlights

హెటిరో డ్రగ్స్ సంస్థల్లో ఐటీ అధికారులు రూ. 142 కోట్లను సీజ్ చేశారు. రూ. 550 కోట్ల లెక్క చూపని ధనాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.నాలుగు రోజుల్లో ఆరు  రాష్ట్రాల్లో 60 చోట్ల సోదాలు నిర్వహించారు.


హైదరాబాద్: హెటిరో డ్రగ్స్ సంస్థల్లో ఐటీ శాఖాధికారులు నిర్వహించిన సోదాల్లో రూ. 142 కోట్ల నగదును సీజ్ చేశారు.  మరో వైపు రూ. 550 కోట్ల నల్ల ధనాన్ని అధికారులు గుర్తించారు.గత వారంలో hetero drugs సంస్థకు చెందిన డైరెక్టర్లు, సీఈఓ ఇళ్లలో  ఐటీ అధికారులు నాలులు రోజుల పాటు సోదాలు నిర్వహించారు.ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను,కంప్యూటర్  హర్డ్ డిస్కులను కూడ ఆదాయ పన్ను శాఖాధికారులు స్వాధీనం చేసుకొన్నారు.

also read:హెటిరో గ్రూప్‌లో ఐటీ దాడులు.. లెక్కకు రాని రూ. 550 కోట్లు లభ్యం!

నాలుగు రోజుల పాటు ఆరు రాష్ట్రాల్లోని  60 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. hyderabad నగరంలోని 30 చోట్ల చిన్న చిన్న అపార్ట్‌మెంట్లను అద్దెకు తీసుకొని నగదును ఈ ఫ్లాట్లలో దాచి పెట్టారు.  అట్టపెట్టెల్లో నగదును ఉంచి  ఇనుప అల్మారాల్లో నిల్వ చేశారు.  విలువైన మెడిసిన్ ను నిల్వ చేస్తున్నామని  స్థానికులను నమ్మించి నదును దాచారు.

మరో వైపు నాలుగు రోజుల పాటు నిర్వహించిన సోదాల్లో రూ. 550 కోట్ల లెక్క చూపని నగదును income tax అధికారులు సీజ్ చేశారు. ఈ నగదును లెక్కించేందుకు రెండు రోజుల సమయం పట్టిందని ఆదాయ పన్ను శాఖాధికారులు తెలిపారు. హెటిరో డ్రగ్స్ సంస్థకు చెందిన సుమారు 100 లాకర్స్ ను ఐటీ అధికారులు  ఓపెన్ చేయాలని భావిస్తున్నారు.


 


 

click me!