హైదరాబాద్ లో హైటెక్ వ్యభిచారం... గుట్టు రట్టు చేసిన పోలీసులు

By Arun Kumar PFirst Published Jul 2, 2021, 12:59 PM IST
Highlights

హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై స్థానిక పోలీసులు దాడిచేయడంతో ఈ గలీజ్ దందా విషయం బయటపడింది. 

హైదరాబాద్: అమ్మాయిలతో గుట్టుగా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయ్యింది. హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై స్థానిక పోలీసులు దాడిచేయడంతో ఈ గలీజ్ దందా విషయం బయటపడింది. 

వివరాల్లోకి వెళితే... కేపీహెచ్‌బీ కాలనీ ధర్మారెడ్డి కాలనీఫేజ్‌ 1 లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న వ్యభిచార ముఠా వివిధ ప్రాంతాల నుండి అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారాన్ని నిర్వహిస్తోంది. సోషల్ మీడియా, ఆన్లైన్ వేదికల ద్వారా విటులను ఆకర్షించి గుట్టుచప్పుడు కాకుండా పని కానిస్తున్నారు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు యాంటి హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ టీంతో పాటు స్థానిక పోలీసులు ఈ వ్యభిచార  గృహంపై దాడి చేశారు. 

read more  పాతబస్తీలో ముజ్ర పార్టీ.. ఫోటోలు లీక్..!

ఈ దాడిలో ఓ యువతితో పాటు అదే కాలనీకి చెందిన మేకల కృపాకర్‌(29),  గాజుల రామారం ప్రాంతానికి చెందిన ఆనంద్(22) పట్టుబడ్డారు. అలాగే కొన్ని సెల్ ఫోన్లు, నగదు, కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. యువతిని రాహాబిటేషన్‌ సెంటర్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరికి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

click me!