చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని వల్లి ఫంక్షన్ హాల్‌లో జరిగిన పెళ్లి రిసెప్షన్‌లో నజీర్‌ అనే వ్యక్తి ముజ్ర పార్టీ ఏర్పాటు చేశారు. 

పాతబస్తీలో ఓ పెళ్లి రిసెప్షన్ లో ముజ్ర పార్టీ నిర్వహించారు. కాగా.. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఫోటో గ్రాఫర్ లీక్ చేశాడు. ఈ కారణంగా.. సదరు ఫోటో గ్రాఫర్ పై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని వల్లి ఫంక్షన్ హాల్‌లో జరిగిన పెళ్లి రిసెప్షన్‌లో నజీర్‌ అనే వ్యక్తి ముజ్ర పార్టీ ఏర్పాటు చేశారు. 

వీడియోలు బయటకు రావడంతో ఫొటోగ్రాఫర్‌పై పెళ్లి బృందం దాడికి పాల్పడింది. దీంతో ఫొటోగ్రాఫర్‌ చాంద్రాయణగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాడి చేసిన నజీర్, షేక్ సలాం, అబ్దుల్ రజాక్‌, ఫైజర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.