హైద్రాబాద్‌లో డ్రగ్స్ విక్రయం: ఇద్దరి నైజీరియన్లు అరెస్ట్

By narsimha lodeFirst Published Oct 3, 2021, 4:03 PM IST
Highlights

హైద్రాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. 4 గ్రాముల కొకైన్ ను పోలీసులు సీజ్ చేశారు. జాన్ పాల్, డేనియల్ అనే ఇద్దరు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: హైద్రాబాద్ (hyderabad) పంజాగుట్టలో (panjagutta) 4 గ్రాముల కొకైన్ (cocaine) సీజ్ చేశారు. ఈ ఘటనలో  ఇద్దరు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు.హైద్రాబాద్  లో చదువుకొనేందుకు వచ్చిన నైజీరియన్లు డ్రగ్స్ (drug)సరఫరా చేస్తూ పట్టుబట్టారు.నిందితులు జాన్ పాల్ (john paul), డేనియల్ (danial) లను పోలీసులు (police)అరెస్ట్ (arrest)చేశారు.

also read:ఎఫ్రిడిన్ తయారీ ఇక్కడే:ముంబై డ్రగ్స్ కేసుతో హైద్రాబాద్‌‌కి లింకులు?

హైద్రాబాద్‌లో డ్రగ్స్ సరఫరాలో ఎక్కువగా నైజీరియన్లు (nigerian)కీలకపాత్ర పోషిస్తున్నారు. హైద్రాబాద్ డ్రగ్స్ కేసుల్లో నైజీరియన్లు ఎక్కువ మంది అరెస్టయ్యారు. చదువు కోసం వచ్చి హైద్రాబాద్ లో ఎక్కువ మంది నైజీరియన్లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీసులు అనుమానిఃస్తున్నారు.

శనివారం నాడు ముంబైలో (mumbai)షిప్‌లో పట్టుబడిన ఎఫిడ్రిన్ సైతం హైద్రాబాద్ నుండే వచ్చిందనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బెంగుళూరులో అరెస్టైన యోగిత, సిద్దిఖ్ అహ్మద్ ల విచారణలో ఎఫిడ్రిన్ తయారీ హైద్రాబాద్ లో చేస్తున్నారని అధికారులు గుర్తించారు.

అస్ట్రేలియాకు ఎగుమతి చేసేందుకు ప్రయత్నం చేస్తున్న డ్రగ్స్ ముఠాను అధికారులు పట్టుకొన్నారు. ఎపిడ్రిన్ తయారీ హైద్రాబాద్ కేంద్రంగా నడిచినట్టుగా అధికారులు గుర్తించారు. మాదక ద్రవ్యాలకు అవసరమైన ముడి సరుకును హైద్రాబాద్ కు దిగుమతి చేసుకొంటున్నారు. ఇక్కడే ఎఫిడ్రిన్ గా మార్చి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. హైద్రాబాద్ నుండి విదేశాలకు కూడా వీటిని సరఫరా చేస్తున్నారని ఎన్సీబీ అధికారులు అనుమానిస్తున్నారు.
 

click me!