Asianet News TeluguAsianet News Telugu

ఎఫ్రిడిన్ తయారీ ఇక్కడే:ముంబై డ్రగ్స్ కేసుతో హైద్రాబాద్‌‌కి లింకులు?

ముంబై డ్రగ్స్ కేసుతో హైద్రాబాద్ కు లింకులున్నాయని అధికారులు అనుమానిస్తున్నారు.శనివారం నాడు షిప్ లో లభ్యమైన డ్రగ్స్ కు సంబంధిచి ఎన్సీబీ అధికారులు కీలక విషయాలను గుర్తించారు.ఎఫిడ్రిన్ సైతం హైద్రాబాద్ నుండే వచ్చిందనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. 

NCB suspects ephedrine making in Hyderabad
Author
Hyderabad, First Published Oct 3, 2021, 3:11 PM IST

హైదరాబాద్: ముంబైలో డ్రగ్స్ (mumbai drug case) కేసులో హైద్రాబాద్ (hyderabad)కు లింకులు ఉన్నాయని  అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.శనివారం నాడు ముంబైలో షిప్‌లో పట్టుబడిన ఎఫిడ్రిన్(epridin) సైతం హైద్రాబాద్ నుండే వచ్చిందనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బెంగుళూరులో (banglored) అరెస్టైన యోగిత, సిద్దిఖ్ అహ్మద్ ల విచారణలో ఎఫిడ్రిన్ తయారీ హైద్రాబాద్ లో చేస్తున్నారని అధికారులు గుర్తించారు.

అస్ట్రేలియాకు ఎగుమతి చేసేందుకు ప్రయత్నం చేస్తున్న డ్రగ్స్ ముఠాను అధికారులు పట్టుకొన్నారు. ఎపిడ్రిన్ తయారీ హైద్రాబాద్ కేంద్రంగా నడిచినట్టుగా అధికారులు గుర్తించారు. మాదక ద్రవ్యాలకు అవసరమైన ముడి సరుకును హైద్రాబాద్ కు దిగుమతి చేసుకొంటున్నారు. ఇక్కడే ఎఫిడ్రిన్ గా మార్చి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. హైద్రాబాద్ నుండి విదేశాలకు కూడా వీటిని సరఫరా చేస్తున్నారని ఎన్సీబీ అధికారులు అనుమానిస్తున్నారు.

ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో పట్టుబడిన డ్రగ్స్ తో ఏపీ రాష్ట్రం పేరు విన్నించింది.ఈ డ్రగ్స్ ను  విజయవాడ కేంద్రంగా ఉన్న ఓ సంస్థ పేరుతో రవాణా చేస్తున్నారని అధికారులు గుర్తించారు. విజయవాడ అడ్రస్ ఇచ్చిన వారు బియ్యం రవాణా పేరుతో డ్రగ్స్ సరఫరా చేశారని అధికారులు గుర్తించారు. విజయవాడతో పాటు  తూర్పు గోదావరి జిల్లాల్లో కూడ డ్రగ్స్ వ్యవహరంతో సంబంధం ఉందని అధికారులు అనుమానించారు. అయితే ఈ ఆరోపణలను ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తీవ్రంగా ఖండించారు. విజయవాడ అడ్రస్ ను మాత్రమే ఉపయోగించుకొన్నారని చెప్పారు. కానీ  విజయవాడతో డ్రగ్స్ మూలాలకు సంబంధం లేదని డీజీపీ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios