సోషల్ మీడియాలో క్లాస్ మేట్ యువతి న్యూడ్ ఫోటోస్ పెట్టిన యువకుడు

First Published Jun 29, 2018, 1:59 PM IST
Highlights

యువతి పేరుతోనే నకిలీ అకౌంట్ సృష్టించి...అందులోనే...

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఓ విద్యార్థినిని వేదిస్తున్న యువకుడిని రాజకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తన క్లాస్ మేట్ యువతి వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి ఆమెను బ్లాక్ మెయిల్ కు దిగడంతో పోలీసులు ఇతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చోటుచేసుకుంది.

ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈర్ల విఠల్ కుమార్ అనే యువకుడు ఉప్పల్ లోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇతడు తన క్లాస్ లోని ఓ అమ్మాయితో సన్నిహితంగా ఉండేవాడు. అయితే కొద్దిరోజులుగా ఆమే మరో యువకుడితో కలిసి తిరుగుతుండటం విఠల్ గమనించాడు. దీంతో ఆమెపై కొపాన్ని పెంచుకున్నాడు. 

సదరు యువతికి తెలియకుండా ఆమె ఇన్స్ టాగ్రామ్ యూజర్ ఐడీ తో పాటు పాస్ వర్డ్ ను తెలుసుకున్నాడు. ఆ అకౌంట్ ఓపెన్ చేసి అందులో వున్న ఆమె వ్యక్తిగత పోటోలతో పాటు ఆమె స్నేహితుల పోటోలను తీసుకున్నాడు. ఆ తర్వాత వాటిని చూపించి యువతిని బ్లాక్ మెయిల్ చేసి ఆమె ద్వారానే మరిన్ని న్యూడ్ ఫోటోలు సంపాదించాడు.

ఆ యువతి పేరుతో మరో నకిలీ ఇన్స్ టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో ఈ పోటోలను పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక సమాచారాన్ని ఉపయోగించి నిందితుడిని కూకట్ పల్లి బస్ స్టాన్ లో ఉండగా అరెస్ట్ చేశారు. అతడి వద్ద ఉన్న సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. అతడిపై సైబర్ నేరం కింద కేసు నమోదు చేసినట్లు పోలీపులు తెలిపారు.

 అమ్మాయిలు ఈ సోషల్ మీడియాను ఉపయోగించేటపుడు జాగ్రత్తలు పాటించాలని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. వారు తమ వ్యక్తిగతమైన ఫోటోలను స్మార్ట్ ఫోన్లలో పెట్టుకోవడం గానీ లేదా వాటిని ఇతరులతో పంచుకోవడం కానీ చేయరాదని పోలీసులు తెలిపారు. వాటి ద్వారా అమ్మాయిల వ్యక్తిగత జీవితంలో అలజడి మొదలయ్యే అవకాశం ఉందని, అందువల్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.  

 

click me!