కేసీఆర్ హుజూర్ నగర్ వ్యూహం: కాంగ్రెెసుకు కౌంటర్ అదే...

By telugu teamFirst Published Sep 24, 2019, 2:23 PM IST
Highlights

కాంగ్రెసు విమర్శలను తిప్పకొట్టడానికి కెసీఆర్ హుజూర్ నగర్ ఉప ఎన్నికను వాడుకుంటున్నట్లు అర్థమవుతోంది. హుజూర్ నగర్ లో కాంగ్రెసు అభ్యర్థిని ఓడించడం ద్వారా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాలనేది ఆయన వ్యూహం.

తమ పార్టీ నుండి తెరాస కు ఫిరాయించిన వారందరిని తరచూ టార్గెట్ చేస్తూ దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవండి అనే సవాల్ ను విసురుతుంది కాంగ్రెస్ పార్టీ. తెరాస ఎప్పటికప్పుడు వీరు ఫిరాయింపుదారులు కాదు, శాసనసభాపక్షం విలీనం అని చెబుతుంది. టెక్నికల్ గా కరెక్ట్ అయ్యి ఉండొచ్చుగానీ ఆ ఫిరాయించిన లేదా శాసనసభా పక్ష విలీనం వల్ల గులాబీ కండువాలు కప్పుకున్న వారంతా గెలిచింది కాంగ్రెస్ టికెట్ మీదనే అనే విషయం మాత్రం అక్షర సత్యం. 

ఈ సవాలును విపక్షాలు అవసరమొచ్చినప్పుడల్లా విసురుతూ ఒకింత తెరాస ను ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పుడు ఆ విమర్శలన్నిటికి చెక్ పెట్టడానికి కెసిఆర్ కు ఒక మహత్తరమైన అవకాశం దక్కింది. అదే హుజూర్ నగర్ ఉప ఎన్నిక. ఈ ఎన్నికలో గనుక విజయం సాధిస్తే విపక్షాల నోర్లు చాలా తేలికగా మూయించోచ్చని కెసిఆర్ భావిస్తున్నారు. 

ఈ సీటులో గత పర్యాయం విజయం సాధించింది పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సారి అక్కడినుండి పోటీ చేస్తోంది ఉత్తమ్ సతీమణి పద్మావతి. ఈ హుజూర్ నగర్ సీటు కాంగ్రెస్ కి సిట్టింగ్ సీట్. గతంలో ఇక్కడినుండి తెరాస గెలిచిన దాఖలాలు లేవు. 2009లో ప్రస్తుత మంత్రి జగదీశ్ రెడ్డి ఇక్కడినుండి పోటీ చేసి ఓడిపోయారు. తరువాత 2014లో కాసోజు శంకరమ్మ ఓడిపోయారు. 2018లో శానంపూడి సైదిరెడ్డి ఓటమిచెందారు. 

ఇలా ఒక్కసారి కూడా గెలవని సీట్, పైగా కాంగ్రెస్ సిట్టింగ్ సీట్, ఖాళీ చేసింది పీసీసీ అధ్యక్షుడు, పోటీ చేస్తుంది పీసీసీ  అధ్యక్షుడి సతీమణి ఇన్ని ఫాక్టర్స్ నేపథ్యంలో తెరాస ఈ సీటును గనుక గెలిస్తే ఇతర పార్టీలనుండి తెరాస లో చేరిన  ఫిరాయింపుదారులకు నైతికతను ఆపాదించొచ్చని అధికార పార్టీ భావిస్తుంది. 

మీ సీటులోనే మేము గెలిచామంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా అలవోకగా గెలుస్తారని కాంగ్రెస్ కి కౌంటర్ ఇవ్వనుంది తెరాస. ఈ విషయమై ప్రజల్లో కూడా అందరినీ రాజీనామా చేయించి ఎన్నికలకు పోవడం అంటే ప్రజాధనాన్ని వృధా చేయడమేనని, అంతలా అందరినీ రాజీనామా కోరేవారు వారి సిట్టింగ్ సీటును కూడా కాపాడుకోలేకపోయారని తన వాదనను బలంగా వినిపించాలని ప్లాన్స్ వేస్తుంది తెరాస.  

ఈ రీజనింగ్ ను తన మార్క్ డైలాగ్ డెలివరీతో కెసిఆర్ గనుక చెబితే సభల్లో చప్పట్లు హోరెత్తడం ఖాయం. మునిసిపల్ ఎన్నికలు కూడా రానున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో తెరాస విజయం కాంగ్రెస్ స్థైర్యాన్ని మరింతగా దెబ్బతీసేందుకు ఉపయోగపడుతుంది. 

సంబంధిత వార్తలు

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్ధి ఈమెనే

గెలుపు మనదే,50 వేల మెజారిటీ రావాలి: సైదిరెడ్డితో కేసీఆర్

హుజూర్ నగర్ చాలా హాట్ గురూ..: కేసీఆర్ కు సవాల్ ఇదే...

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: బిజెపిలోకి కాసోజు శంకరమ్మ?

హుజూర్‌నగర్ బైపోల్: సీపీఐ, జనసేన మద్దతుకు ఉత్తమ్ ప్రయత్నాలు

సైదిరెడ్డి స్థానీయత: ఉత్తమ్ ప్రకటనలోని ఆంతర్యం ఇదే...

శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రవాడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష్యం అదే

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే

హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

click me!