మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

By narsimha lode  |  First Published Oct 12, 2018, 6:27 PM IST

 మహాకూటమిలోని పార్టీలోని టీజేఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు


హైదరాబాద్: మహాకూటమిలోని పార్టీలోని టీజేఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు మరోసారి  టీజేఎస్, కాంగ్రెస్ నేతలు మరోసారి సమావేశం కానున్నారు.

మహాకూటమిలో సీపీఐ, టీడీపీ, కాంగ్రెస్‌తో పాటు టీజేఎస్‌ కూడ భాగస్వామిగా ఉంది.ఈ నాలుగు పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు చర్చలు సాగుతున్నాయి.

Latest Videos

సీట్ల సర్ధుబాటు విషయమై  టీజేఎస్ చీఫ్  కోదండరామ్‌తో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించారు. 8 స్థానాలను టీజేఎస్‌కు ఇస్తామని చెప్పారు. కానీ టీజేఎస్ మాత్రం ఇందుకు అంగీకరించలేదు. 

టీజేఎస్  చీఫ్ కోదండరామ్ మాత్రం కనీసం ఒక్క పార్లమెంట్ స్థానానికి ఒక్క అసెంబ్లీ సీటైనా తమకు ఇవ్వాల్సిందేనని  కాంగ్రెస్ పార్టీని కోరారు.  ఈ లెక్కన  కనీసం 17 అసెంబ్లీ సీట్లను  కోదండరామ్ కోరుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం కోదండరామ్ కోరుతున్న 17 సీట్ల విషయమై  కోర్ కమిటీలో చర్చించి చెబుతామని కోదండరామ్‌కు చెప్పారు. దీంతో  సీట్ల సర్ధుబాటు విషయమై కాంగ్రెస్ నేతలు మరోసారి కోదండరామ్‌తో  సమావేశం కావాలని నిర్ణయం తీసుకొన్నారు.

సంబంధిత వార్తలు

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

click me!