కుప్పకూలిన స్టేజి...వేదికపై నుండి కిందపడ్డ విజయశాంతి

Published : Oct 12, 2018, 06:09 PM ISTUpdated : Oct 12, 2018, 06:26 PM IST
కుప్పకూలిన స్టేజి...వేదికపై నుండి కిందపడ్డ విజయశాంతి

సారాంశం

మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేసిన సభలో ప్రమాదం చోటుచేసుకుంది. సీనియర్ కాంగ్రెస్ నాయకులు స్టేజిపై ఉండగానే ఒక్కసారిగా అది కుప్పకూలింది. ఈ ప్రమాదం కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ప్రసంగానికి సిద్దమవుతుండగా జరిగింది. దీంతో ఒక్కసారిగా వేదికతో పాటే విజయశాంతి కిందపడిపోయారు.

ఈ ప్రమాద సమయంలో విజయశాంతితో పాటు ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క, సలీం అహ్మద్ ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో నుండి నాయకులంతా సురక్షితంగా బైటపడ్డారు. నాయకులే కాదు కార్యకర్తలకు కూడా ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో ప్రచారాన్ని నిర్వహించిన ప్రచార కమిటీ మొదట కొల్లాపూర్ లో రోడ్ షో తో పాటు బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్ లో అచ్చంపేటకు చేరుకున్న నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీ చేపట్టారు. ఆ తర్వాత బహిరంగ సభ కోసం సెంట్రింగ్ కర్రలతో నిర్మించిన వేదికపైకి ఎక్కారు. ఈ సమయంలో నాయకులతో పాటు కార్యకర్తలు కూడా అధిక సంఖ్యలో వేదికపైకి ఎక్కారు.

అంతే కాకుండా స్టార్ క్యాంపెయినర్, సినీ నటి విజయ శాంతికి షేక్ హ్యండ్ ఇవ్వడానికి కార్యకర్తలు ఎగబడ్డారు. ఈ క్రమంలో విజయశాంతి కూడా స్టేజి పై కలియతిరుగుతూ వారికి అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. వేధికతో పాటే విజయశాంతి కూడా కిందపడిపోయారు. అయితే ఆమెకు ఎలాంటి గాయాలు కాలేవు.  
 
PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌