ఖబర్దార్ రేవంత్ రెడ్డి...టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ హెచ్చరిక (వీడియో)

Published : Oct 12, 2018, 05:58 PM IST
ఖబర్దార్ రేవంత్ రెడ్డి...టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ హెచ్చరిక (వీడియో)

సారాంశం

నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే షకీల్ స్పందించారు.  బోధన్ నియోజకవర్గంలో తనను ఎదుర్కొనే దమ్ము లేకే కాంగ్రెస్ నాయకులు జోకర్ రేవంత్ రెడ్డి ని తీసుకువచ్చి ప్రజలకు సర్కస్ చూపించారని ఎద్దేవా చేశాడు. సీఎం కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ సరిపోరని విమర్శించారు. అలాగే ఎంపి కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బోధన్ ప్రజలు మీకు తగిన గుణపాఠం చెబుతారుని షకీల్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు.  

మైనారిటీ లకు చులకన చేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి... కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మైనారిటీలు ఎందుకు అభివృద్ధి చెందలేదో చెప్పాలని ప్రశ్నించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత మైనారిటీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుని షకీల్ స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ పార్టీ జోకర్ రేవంత్ రెడ్డికి దమ్ముంటే బోధన్ లో తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. అప్పుడు తన సత్తా ఏమిటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. బోధన్ కాంగ్రెస్ బహిరంగ సభలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కి మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు .దీన్ని బట్టి ప్రజలలో ఆయన స్థాయి ఏంటో
అర్ధమవుతుందన్నారు.

తనపై నిరాధార ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డికి దమ్ముంటే వాటిని నిరూపించాలన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు ఈ ఆరోపణల పై చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ షకీల్ ప్రశ్నించారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి...నోటికొచ్చినట్టు మాట్లాడితే చట్టపరంగా చర్యలు తప్పవని షకీల్ హెచ్చరించారు. 

వీడియో

"

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu