అమీర్‌పేటలో కేఎల్‌ఎం స్టోర్‌ను సీజ్ చేసిన జీహెచ్‌ఎంసీ.. కారణమిదే..!

By Sumanth KanukulaFirst Published Jan 29, 2022, 2:10 PM IST
Highlights

హైదరాబాద్ అమీర్‌పేటలోని కేఎల్‌ఎం స్టోర్‌ను జీహెచ్‌ఎంసీ సీజ్ చేసింది. ఎలివేషన్ పనులు సక్రమంగా లేవని జీహెచ్‌ఎంసీ అధికారులు కేఎల్‌ఎం షోరూమ్‌ను సీజ్ చేశారు. 

హైదరాబాద్ (Hyderabad) అమీర్‌పేటలోని కేఎల్‌ఎం స్టోర్‌ను జీహెచ్‌ఎంసీ సీజ్ చేసింది. ఎలివేషన్ పనులు సక్రమంగా లేవని జీహెచ్‌ఎంసీ అధికారులు కేఎల్‌ఎం షోరూమ్‌ను సీజ్ చేశారు. ఎలివేషన్ సరిచేయాలంటూ గతంలోనే జీహెచ్‌ఎంసీ అధికారులు కేఎల్‌ఎం షోరూమ్‌కు నోటీసులు జారీచేశారు. అయితే మూడు సార్లు నోటీసులు ఇచ్చినా షోరూమ్ నిర్వాహకులు పట్టించుకోవలేదని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే షోరూమ్‌ను సీజ్ చేసినట్టుగా చెబుతున్నారు. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

click me!