తెలంగాణ రాష్ట్రంలోకి రుతు పవనాలు ప్రవేశించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. మరో నాాలుగు రోజుల్లో రుతు పవనాలు తెలంగాణలోకి వస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతోనే రుతు పవనాలు ఆలస్యమైనట్టుగా ఐఎండీ చెబుతుంది.
హైదరాబాద్: మరో నాలుగు రోజుల్లో Telanganaలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు అంచనా వేస్తున్నారు. Southwest Monsoon తెలంగాణలోకి ప్రవేశించడానికి ఆలస్యమైంది. ఈనెల మొదటి వారంలోనే రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు అంచనా వేశారు. అయితే సరైన వాతావరణం లేకపోవడంతో నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ఆలస్యంగా ప్రవేశించాయని వాతావరణశాఖాధికారులు చెబుతున్నారు.
నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలో ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ కూడా వర్షాలు సమృద్దిగా కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు అంచనా వేస్తున్నారు.ఉత్తర తెలంగాణలో సాధారణం కంటే ఎక్కువగా Rains నమోదయ్యే అవకాశం ఉందని IMD తెలిపింది. మరో వైపు తూర్పు మధ్యప్రదేశ్ నుండి విదర్భ, తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు ఉపరిత ద్రోణి ఆవరించి ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
undefined
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. మంగళవారం నాడు పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, భూపాలపల్లి, నిర్మల్ జిల్లాల్లో 45 డిగ్రీల కంటే సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. గత 24 గంటల్లో ఆశ్వరావుపేటలో 2.1 మి.మీ వర్షపాతం నమోదైంది.
కేరళ రాష్ట్రంలోకి ఈ ఏడాది మే 29న నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. నిర్ణీత షెడ్యూల్ కంటే రెండు రోజుల ముందే రుతు పవనాలు కేరళలోకి ప్రవేశించినట్టుగా భారత వాతావరణ శాఖ ప్రకటించింది. జూన్ 1వ తేదీ నాటికి Southwest monsoon కేరళ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని తొలుత భావించారు. అయితే రెండు రోజుల ముందుగానే కేరళ రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించినట్టుగా భారత వాతావరణ శాఖ ఆదివారం నాడు ఉదయం ప్రకటించింది. మే 14న IMD అంచనాల మేరకు ఈ నెల 27నే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేసింది.
అయితే వాతావరణంలో మార్పులతో కేరళలో రుతుపవనాల ప్రవేశం కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఆ తర్వాత ప్రకటించింది. ఈ నెల 27న రుతు పవనాలు కేరళలో ప్రవేశించడానికి పరిస్థితులు మరింత మెరుగు పడ్డాయని వాతావరణ శాఖ తెలిపింది.
also read:Heavy Rains: ఈశాన్య భారతంలోకి రుతుపవనాలు.. అసోం, మేఘాలయలో భారీ వర్షాలు !
దక్షిణ అరేబియా సముద్రం మీదుగా పశ్చిమ గాలులు బలపడ్డాయి. దీంతో కేరళ తీరం, దానిని ఆనుకొని ఆగ్నేయ ఆరేబియా సముద్రం ప్రాంతం మేఘావృతం పెరిగింది. దీంతో రానున్న రెండు మూడు రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని ఈ నెల 27న ఐఎండీ ప్రకటించింది.
అంతేకాదు లక్షద్వీప్, అరేబియా సముద్రం ప్రాంతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి కూడా పరిస్థితుులు అనుకూలంగా ఉన్నాయని ఆ ప్రకటనలో ఐఎండీ తెలిపింది.నైరుతి రుతుపవనాలు భారతదేశ వ్యవసాయ ఆధారిత ఆర్ధిక వ్యవస్థకు జీవనాధారంగా పరిగణించనున్నారు.