‘‘కమ్మ ఓట్లు వద్దా’’.. టీపీసీసీపై రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు

By sivanagaprasad kodatiFirst Published Nov 16, 2018, 2:18 PM IST
Highlights

టీపీసీసీ పెద్దలపై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ల కేటాయింపులో కమ్మ వారికి అన్యాయం జరిగిందని... కేవలం ఒక సామాజిక వర్గానికే అత్యధిక సీట్లు కేటాయించారని ఆమె ఆరోపించారు. 

టీపీసీసీ పెద్దలపై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ల కేటాయింపులో కమ్మ వారికి అన్యాయం జరిగిందని... కేవలం ఒక సామాజిక వర్గానికే అత్యధిక సీట్లు కేటాయించారని ఆమె ఆరోపించారు.

కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయని.. బీసీలు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారని.. విద్యార్ధులు కూడా అసంతృప్తితో ఉన్నారని దీనికి కారణం ఎవరని ఆమె ప్రశ్నించారు. ఎన్నో రకాలుగా బలమైన కమ్మ సామాజిక వర్గానికి ఏ ధైర్యంతో టికెట్ ఇవ్వలేదని రేణుక మండిపడ్డారు.

టికెట్లు పొందిన ఇతర సామాజిక వర్గా నేతలంతా బలమైన వారు...సరైనవారా..? అని ఆమె ప్రశ్నించారు. కమ్మ ఓట్లు మీకు అవసరం లేదా అని దుయ్యబట్టిన ఆమె.. ఒక సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు ఇప్పించుకుని... రాజ్యాన్ని ఏలుదామనుకుంటున్నారా అని ఎద్దేవా చేశారు.

ఖమ్మం జిల్లాలో కూడా స్థానిక నేతలను సంప్రదించకుండా.. వారి ఇష్టానుసారం టికెట్లు ఇచ్చారని విమర్శించారు. తాను పోటీ చేయాలనుకుంటే అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు. సమ సమాజం అనేది రాహుల్, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని.. దీనికి విరుద్ధంగా టీపీసీసీ నేతలు వ్యవహరించారని రేణుక విమర్శించారు.

పార్టీకి ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావడం ఇష్టం లేక ఆవేదననంతా దిగమింగుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితాలు వ్యతిరేకంగా వస్తే.. దీనికి కారణమైన నేతలంతా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాల్సిందేనని అన్నారు... కార్యకర్తలతో చర్చించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని రేణుకా చౌదరి స్పష్టం చేశారు.

బిగ్‌పైట్: రేవంత్‌‌ రెడ్డిపై పట్నం అమీతుమీ

ఎన్నికల ఎఫెక్ట్..15రోజుల్లో మూడు పార్టీలు మారాడు

2014లో జీరో: ఆ తర్వాతే రేవంత్‌పై కేసుల చిట్టా

33 ఏళ్ల తర్వాత తెలంగాణలో నందమూరి ఫేటు ఎలా ఉందో, నాడు ఎన్టీఆర్...నేడు సుహాసిని

హరికృష్ణ కుమార్తెకే కూకట్ పల్లి టిక్కెట్, 17న సుహాసిని నామినేషన్

 

click me!