Etela Rajender: కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ లోపం వల్లనే వ‌ర‌ద‌లు.. రాష్ట్ర‌ప్ర‌భుత్వంపై ఈటల ఫైర్ 

By Rajesh KFirst Published Jul 19, 2022, 7:00 PM IST
Highlights

Etela Rajender: కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ లోపం వల్లనే పంప్ హౌజ్ లు మునిగిపోయాయని బీజేపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమ‌ర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఒక్క ఎకరాకు నీరు ఇవ్వదానికి 27 వేల రూపాయల కరెంటు ఖర్చు అవుతోంద‌ని అన్నారు.
 

Etela Rajender:  తెలంగాణ ఇటీవల కురిసిన‌ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజల జన జీవనం అస్తవ్యస్తంగా మారిందని బీజేపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వర్షాకాలంలో అత్యంత అప్రమత్తంగా ఉండి.. సహాయక కార్యక్రమాలు అందించాల్సిన ఇరిగేషన్ శాఖ అధికారులు విలాసాల పేరిట విదేశాల‌కు వెళ్ల‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అధికారుల పర్యటనకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వానిది కూడా తప్పేన‌ని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ లోపం వల్లనే పంప్ హౌజ్ లు మునిగిపోయాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఒక్క ఎకరాకు నీరు ఇవ్వదానికి 27 వేల రూపాయల కరెంటు ఖర్చు అవుతోంద‌నీ, ఈ ప్రాజెక్ట్ వల్ల లాభం ఉందా ? లేదా? అని మాజీ ఐఏఎస్ అధికారులు అడుగుతున్నారని ఈటల రాజేందర్ అన్నారు.

Latest Videos

గోదావరి పరివాహక ప్రాంత ప్రజల జీవితాలు అతలాకుతలం అయ్యాయనీ, కేవలం ఒక్క భద్రాచలం మాత్రమే నష్టపోయినట్లు అక్కడివారికి మాత్రమే ఇల్లు కట్టిస్త అని సీఎం చెప్పడం బాధాకరమ‌ని అన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో వ‌ర‌ద‌ల వ‌ల్ల ప్రజల జీవితాలు అతలాకుతలం అయ్యాయని, ఈ వర‌ద‌లో Ntv విలేకరి మరణించడం బాధాకరమ‌ని అన్నారు. సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు SRSP నుండి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతం అంతా తిరిగి ప్రజలకు అండగా ఉండాల్సి ఉండే కానీ వారి బాధ్యతని విస్మరించారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

 మంచిర్యాల మునిగిందనీ,గూడు కరువైన వారి గోడు వినడం లేద‌ని అన్నారు. మంథనిలో వేల బస్తాల బియ్యం నీళ్ళ పాలు అయ్యాయనీ, షాపులు అన్నీ నీట మునిగాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు పడయ్యాయి. ఇల్లు మునిగిపోయిన వారందరికీ నష్ట తీవ్రతను అంచనా వేసి ప్రతి ఇంటికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎం కెసిఆర్ ఇతరుల మీద నెపం నెట్టి భాధ్యత నుండి తప్పించుకోవద్దని సూచించారు. 1986 తరువాత ఇంత పెద్ద వరద వచ్చిందనీ, ఇప్పుడే కాబట్టి వారిని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ తరపున మేము కూడా కేంద్రాన్ని కోరామ‌నీ, సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. 
  
1986 లో గోదావరికి అతిపెద్ద వరదలు వచ్చాయి ఎప్పుడు 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఇప్పుడు 25 లక్షల క్యూసెక్కుల నీరు వస్తెనే పరివాహక ప్రాంతం మునిగిపోవడానికి కారణం ఎంటో ప్రభుత్వం చెప్పాలి. ఎక్కడో లోపం ఉంది కాబట్టే.. గతం కంటే తక్కువ నీరు వచ్చిన మునిగింది అని నిపుణులు అంటున్నారని తెలిపారు.

నేనే ఇంజనీరును, నేనే కాళేశ్వర సృష్టి కర్తను అని చెప్పే కెసిఆర్.. ఢాం కట్టడం ద్వారా వచ్చే బాక్ వాటర్ ను అంచనా వేయలేదనీ, వాటి నిర్మాణ లోపం వల్లనే మునిగినాయి. ఇప్పటికీ అయిన బ్యాక్ వాటర్ మీద శాస్త్రీయమైన సర్వే చేసి, ముంపు లేకుండా శాశ్వత పరిష్కారం చూపించాలని అన్నారు. ప్ర‌ధానంగా మేడిగడ్డ, అన్నారం పంప్ హౌజ్ లు మునిగి పోవడానికి నిర్మాణ లోపాలే ప్ర‌ధాన‌ కారణమ‌ని అన్నారు. వర్షాకాలంలో ఇరిగేషన్ శాఖ అత్యంత అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
 
ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 140 టీఎంసీ పంప్ చేశారనీ, ఇందుకు కరెంటు బిల్లు కోసం 3,080 కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. అంటే.. విద్యుత్ ఛార్జీలు యూనిట్ కి 5.80 రూపాయలు ఉంటే దానిని రూ. 6.30 పైసలకు పెంచారు. ఫిక్స్డ్ చార్జెస్ కిలోవాట్ కి 165 రూపాయలు ఉంటే దానిని 275 రూపాయలకి పెంచారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

గోదావరి నుండి మిడ్ మానెరు వరకు ఎత్తిపోతల వల్ల ఎకరానికి 27 వేల రూపాయల ఖర్చు అవుతుందని, అదే కొండపోచమ్మ వరకు అయితే ఎకరానికి 50 వేల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. ఒక టీఎంసీ నీటిని ఎత్తి పోయడానికి దాదాపు 27 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఒక ఎకరం మీద ప్రభుత్వం రూ. 27,300/- ఖర్చు పెట్టింది ఈ ప్రాజెక్ట్ నిర్వహణ చేయగలమా ? లేదా ? అనే అనుమానాలు మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళి లాంటి వారు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

click me!