టాలీవుడ్ డ్రగ్స్ కేసు: 9 గంటల పాటు నవదీప్ విచారణ, ఎఫ్ క్లబ్ ఆర్ధిక లావాదేవీలపై ఆరా

By narsimha lodeFirst Published Sep 13, 2021, 9:58 PM IST
Highlights


టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ ను 9 గంటల పాటు ఈడీ అధికారులు సోమవారం నాడు విచారించారు. ఎఫ్ క్లబ్ మేనేజర్ అర్పిత్ సింగ్ , కెల్విన్ , నవదీప్ మధ్య ఆర్ధిక లావాదేవీలపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే చాలా ప్రశ్నలకు నవదీప్ నోరు మెదపలేదని తెలుస్తోంది.


హైదరాబాద్: సినీ నటుడు నవదీప్  ను ఈడీ అధికారులు సోమవారం నాడు 9 గంటల పాటు విచారించారు.  టాలీవుడ్ డ్రగ్స్ కేఃసుకు నవదీప్ నడిపిన ఎఫ్ కేప్ క్లబ్ కు సంబంధాలున్నాయని ఈడీ గుర్తించింది. ఎఫ్ కేఫ్ క్లబ్ మేనేజర్  కి పలువురు సినీ నటులకు మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగిన విషయాన్ని ఈడీ గుర్తించింది.

ఎఫ్ క్లబ్ వేదికగా డ్రగ్స్ డీలింగ్ కు సంబంధించి నవదీప్ ను సుధీర్ఘంగా ఈడీ అధికారులు ప్రశ్నించారు.ఈడీ అడిగిన పలు ప్రశ్నలకు నవదీప్ సమాధానాలు దాటవేసినట్టుగా తెలుస్తోంది. ఎఫ్ క్లబ్ లో లావాదేవీలపై నవదీప్ నోరు విప్పలేదని సమాచారం.నవదీప్ తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్ ను కూడ విచారించారు

ఈడీ అధికారులు. అయితే క్లబ్ మేనేజర్ , నవదీప్ సమాధానాలకు పొంతన లేదని తెలిసింది. ఎఫ్ క్లబ్ ద్వారా విదేశాలకు డబ్బులు బదిలీ చేసిన విషయమై ఈడీ అధికారులు ప్రశ్నించారు.  తన పబ్ కు విదేశీ కస్టమర్లు రావడం వల్ల లావాదేవీలు జరిగినట్టుగా  నవదీప్ ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

తనకు ఏమీ తెలియదని నవదీప్ చెప్పినట్టుగానే తాను చేశానని మేనేజర్ ఈడీ అధికారుల విచారణలో చెప్పారు. నవదీప్, ఎఫ్ క్లబ్ మేనేజర్, కెల్విన్  మధ్య ఆర్ధిక లావాదేవీలపై కూడ ఈడీ ప్రశ్నించింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు  ఇప్పటికే పూరీ జగన్నాథ్, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందు, దగ్గుబాటి రానా, నవదీప్ లను విచారించారు.


 

click me!