ఫేస్ బుక్ పరిచయం.. వాట్సాప్ న్యూడ్ కాల్ చేయమంటూ ఒత్తిడి.. ఆ తరువాత...

By AN TeluguFirst Published Oct 19, 2021, 8:57 AM IST
Highlights

whatsapp numberతో ఇద్దరూ ఛాటింగ్ చేసుకునేవారు. అది ఎంతవరకు వెళ్లిందంటే... వీడియోకాల్స్ చేసుకునే స్థాయి దాకా చేరింది. ఓ రోజు వాట్సాప్ లో video call చేసి మాట్లాడాడు. ఈ క్రమంలో  nudeగా ఉంటూ తనతో మాట్లాడమని డిగ్రీ విద్యార్థిని కోరాడు. 

మనోహరాబాద్ : వాట్సాప్ లో వీడియో కాల్ ద్వారా నగ్న దృశ్యాలు నమోదు చేసి… వాటితో ఓ విద్యార్థిని బెదిరించిన సంఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో జరిగింది.  తెలిపిన వివరాల ప్రకారం..  మనోహరాబాద్ కు చెందిన degree student ఒకరికి ఈనెల 11న గుర్తు తెలియని వ్యక్తి ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. 

దాన్ని ఆ యువకుడు యాక్సెప్ట్ చేశాడు. ఆ తరువాత కొద్దిరోజులు వారిద్దరూ ఫేస్ బుక్ లో చాట్ చేసుకున్నారు. ఆ తరువాత కొద్దిరోజులకు నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. అలా ఆ యువకుడి వాట్సాప్ నెంబర్ గుర్తు తెలియని వ్యక్తికి చేరింది. 

ఆ తర్వాత అతని whatsapp numberతో ఇద్దరూ ఛాటింగ్ చేసుకునేవారు. అది ఎంతవరకు వెళ్లిందంటే... వీడియోకాల్స్ చేసుకునే స్థాయి దాకా చేరింది. ఓ రోజు వాట్సాప్ లో video call చేసి మాట్లాడాడు. ఈ క్రమంలో  nudeగా ఉంటూ తనతో మాట్లాడమని డిగ్రీ విద్యార్థిని కోరాడు. 

డిగ్రీ చదువుకున్నా ఏ మాత్రం అతనికి డౌట్ రాలేదో.. లేకపోతే వారి మధ్య వేరే రకమైన బంధం పెరుగుతుందో తెలియదు కానీ.. nude callకి విద్యార్థి ఒప్పుకున్నాడు. సదరు వ్యక్తి సూచించిన విధంగానే బాత్రూంలోకి వెళ్లి నగ్నంగా వీడియో కాల్ చేశాడు.  ఈ వీడియోని  సదరు వ్యక్తి రికార్డు చేసి పెట్టాడు.  ఆ తర్వాత ఆ వీడియోని విద్యార్థికి పంపి, సోషల్ మీడియాలో పెడతానని  బెదిరించాడు.  డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్ చేశాడు.

భయపడిన యువకుడు ఫోన్పే ద్వారా రూ.14133 పంపాడు.  రెండు రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి డబ్బులు అడగడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఎన్నారై భర్త అరాచకం.. నగ్నంగా వీడియో కాల్ చేయాలని వేధింపులు, ఒప్పుకోనందుకు చితకబాదిన అత్తామామలు.. !

మైనర్ బాలికకు వేధింపులు

ఇలాంటిదే ఓ ఘటన హైదరాబాద్ లో రెండు నెలల క్రితం జరిగింది. రోజురోజుకూ మైనర్ల మీద మైనర్లు చేస్తున్న అకృత్యాలు మితిమీరిపోతున్నాయి. మితిమీరిన సెల్ ఫోన్ వాడకం, social media, అడ్డూఅదుపూ లేని porn.. అడ్డకునేవారు లేకపోవడం.. చిన్నవయసులోనే అబ్బాయిల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. అలాంటిదే ఓ దారుణ ఘటన హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో జరిగింది. 

ఫ్రెండే కదా నమ్మి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినందుకు మైనర్ బాలికను వేధింపులకు గురిచేస్తున్నాడో మైనర్ బాలుడు. సైదాబాద్ కు చెందిన ఇంటర్మీడియట్ బాలిక ఇన్ స్ట్రాగామ్ అకౌంట్ కు తన క్లాస్ మేట్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. ప్రెండే కదా అని యాక్సెప్ట్ చేయగా కొద్ది రోజులుగా ఇద్దరూ చాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో బాలిక తన ఫ్రెండ్ కు కొన్ని ఫొటోస్ ను పంపింది.

ఆ ఫొటోలతో అతగాడు బాలిక పేరుతో ఫేక్ ఐడీని క్రియేట్ చేశాడు. తనకు న్యూడ్ గా వీడియో కాల్ చేయాలని, లేనిపక్షంలో నీ ఫొటోలన్నింటినీ ఎడిట్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చైసి వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో విసిగెత్తిన బాలిక అతడిమీద శుక్రవారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 

click me!