డేటా చోరీ: గుట్టు వీడేది ఆశోక్ దొరికితేనే

By narsimha lodeFirst Published Mar 5, 2019, 11:25 AM IST
Highlights

ఐటీ గ్రిడ్ కేసులో  ట్విస్ట్ చోటు చేసుకొంది.ఐటీ గ్రిడ్‌పై ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన ఫిర్యాదు  అందితే  మార్చి  రెండో తేదీన కేసు నమోదు చేసినట్టుగా  సమాచారం. 


హైదరాబాద్: ఐటీ గ్రిడ్ కేసులో  ట్విస్ట్ చోటు చేసుకొంది.ఐటీ గ్రిడ్‌పై ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన ఫిర్యాదు  అందితే  మార్చి  రెండో తేదీన కేసు నమోదు చేసినట్టుగా  సమాచారం. ఈ కేసులో ఆశోక్‌ దొరికితేనే అసలు విషయాలు వెలుగు చూస్తాయని  సైబరాబాద్ పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

ఏపీ ప్రభుత్వ లబ్దిదారుల సమాచారం లీకైందని వైసీపీ జనరల్ సెక్రటరీ  విజయసాయి రెడ్డి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత నెల 22వ తేదీన విజయసాయిరెడ్డి ఈ ఫిర్యాదు ఇచ్చారు.

ఇదే విషయమై లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి కూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోకేశ్వర్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు  సైబరాబాద్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఐటీ గ్రిడ్ సంస్థ సేకరించిన సమాచారాన్ని అమెజాన్ సర్వీసెస్‌లో హోస్ట్ చేస్తున్నట్టుగా గుర్తించినట్టుగా సైబరాబాద్ సీపీ సోమవారం నాడు ప్రకటించారు.

ఈ కేసు విషయమై ముందుగానే అశోక్‌ కు లీకైనట్టుగా తెలుస్తోంది. ఈ సమాచారం లీక్  కావడంతో ఆశోక్  మూడు కీలకమైన హార్డ్ డిస్క్‌లను తీసుకొని ఆశోక్  పారిపోయినట్టుగా  చెబుతున్నారు.

ఆశోక్ ఏపీ పోలీసుల ఆధీనంలో ఉన్నట్టు తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు.ఆశోక్ దొరికితేనే ఈ కేసులో చిక్కుముడులు  వీడే అవకాశం ఉందని  సైబరాబాద్ పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

డేటా చోరీ: ఐటీ గ్రిడ్ యజమాని ఆశోక్ మెడకు ఉచ్చు

ఐటీ గ్రిడ్: కీలక సమాచారం, ఆ డేటా ఎలా వచ్చింది: సీపీ సజ్జనార్

మా జోలికొస్తే ...ఖబడ్దార్: కేసీఆర్‌కు చంద్రబాబు వార్నింగ్

సానుభూతి కోసమే కేసీఆర్‌పై ఆరోపణలు, ఏపీలో జరిగేదే జరుగుతోంది: కేటీఆర్

టీడీపీ యాప్ సర్వీస్ ప్రోవైడర్ వివాదం: కేసీఆర్‌పై భగ్గుమన్న చంద్రబాబు

ఏపీ పోలీసులు బెదిరిస్తున్నారు, రక్షణ కల్పించండి: లోకేశ్వర్ రెడ్డి

డేటా చోరీ: బాబుతో అడ్వకేట్ జనరల్ భేటీ, ఏం చేద్దాం

డేటావార్: కూకట్‌పల్లిలో ఏపీ పోలీసులకు నో ఎంట్రీ

డేటా చోరీపై ట్విస్ట్: భాస్కర్‌ కోసం హైద్రాబాద్‌కు ఏపీ పోలీసులు

click me!