తెలంగాణ భవన్ వద్ద రోడ్డుపై పది అడుగుల లోతు గొయ్యి

Published : Mar 05, 2019, 10:31 AM IST
తెలంగాణ భవన్ వద్ద రోడ్డుపై పది అడుగుల లోతు గొయ్యి

సారాంశం

బసవతారకం ఆస్పత్రి కూడలి నుంచి రోడ్డు నం.12కు వెళ్లే దారిలో ఆ గుంత ఏర్పడింది. తొలుత ట్రాఫిక్‌ పోలీసు అధికారులు సిబ్బందితో ఆ ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. 

హైదరాబాద్: వాహనాలతో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతంలో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా రోడ్డు కుంగిపోయింది. తెలంగాణ భవన్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆ మార్గంలో ప్రయాణం సాగిస్తూ ఉంటారు. 

పెద్ద గుంత ఏర్పడి వాహనాల రాకపోకలకు  అంతరాయం ఏర్పడింది. సోమవారం సాయంత్రం ఐదున్నర సమయంలో ప్రధాన రహదారిపై దాదాపు ఒకటిన్నర మీటర్ల వ్యాసంతో గుంత ఏర్పడింది. దాదాపు అది పది అడుగుల లోతు ఉన్నట్లు అంచనా వేశారు. 

బసవతారకం ఆస్పత్రి కూడలి నుంచి రోడ్డు నం.12కు వెళ్లే దారిలో ఆ గుంత ఏర్పడింది. తొలుత ట్రాఫిక్‌ పోలీసు అధికారులు సిబ్బందితో ఆ ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఆ తర్వాత ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుని మున్సిపల్‌, జలమండలి విభాగాలకు సమాచారం అందించారు.  

జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ ముషరఫ్‌అలీ ఇతర అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అది తమ పరిధిలోకి కాదని వెళ్లిపోయారు. ఆ తర్వాత బంజారాహిల్స్‌ డీజీఎం వినోద్‌ సహా సిబ్బంది చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. జేసీబీ యంత్రంతో ఆ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Harish Rao Comments on Revanth Reddy:టెండర్లురద్దు చేసి సిబిఐవిచారణ జరిపించాలి | Asianet News Telugu
Airport: హైద‌రాబాద్ ఒక్క‌టే కాదు.. ఈ ప్రాంతాల్లో కూడా రియ‌ల్ బూమ్ ఖాయం. కొత్త ఎయిర్ పోర్టులు