సీఎం రేసులో లేను.. ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: జైపాల్ రెడ్డి

By sivanagaprasad kodatiFirst Published Nov 4, 2018, 3:32 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పొత్తుల వ్యవహారాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత టీఆర్ఎస్, బీజేపీ చేతులు కలిపే అవకాశం నూటికి నూరు శాతం ఉందన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పొత్తుల వ్యవహారాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత టీఆర్ఎస్, బీజేపీ చేతులు కలిపే అవకాశం నూటికి నూరు శాతం ఉందన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ 50 శాతం సీట్లు గెలిచే అవకాశం లేదు.. అందువల్ల బీజేపీకి 6-7 సీట్లు వస్తాయి కాబట్టి.. టీఆర్ఎస్ చీఫ్ వెంటనే బీజేపీ, ఎంఐఎంతో సంప్రదింపులు జరుపుతారు..దీనితో పాటు ప్రధాని నరేంద్రమోడీకి, కేసీఆర్‌కి మధ్య మంచి అవగాహన ఉంది.. అదే జరిగితే కనుక ఎంఐఎం పరిస్థితి దారుణంగా ఉంటుందని జైపాల్ రెడ్డి అన్నారు.

అయితే అలాంటి పరిస్థితి రాదని... రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా మెజార్టీ సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జైపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

అలాగే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ చాలా ఆందోళనకు గురువుతున్నట్లుగా ఉన్నారని... ముందస్తు ఎన్నికల నిర్ణయం పట్ల ఆయన ఆనందంగా ఉండరని తాను భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే తాను సీఎం రేసులో లేనని... ప్రస్తుతం వయసుకు సంబంధించిన సమస్యల వల్ల నేను అసలు ఎన్నికల్లో పోటీ చేడం లేదని జైపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. 

రసమయికి చేదు అనుభవం: 4 ఏళ్లలో ఏం చేశావని నిలదీత

శేరిలింగంపల్లి లొల్లి: గాంధీ భవన్ ఎదుట బిక్షపతి ధర్నా, ఇద్దరి ఆత్మహత్యాయత్నం

టీడీపీలో ముసలం: మెనిగళ్లపై మువ్వ వర్గీయులు చెప్పులతో దాడి

నేను గెలిస్తే హరీష్ ఔటే...: జగ్గారెడ్డి

సీట్ల పంచాయతీ: రహస్య ప్రదేశంలో కోదండరామ్ చర్చలు, ఆ తర్వాతే...

జానారెడ్డికి చేదు అనుభవం

రాహుల్ గాంధీతో హరీష్ టచ్ లో ఉన్నారు: వంటేరు సంచలన వ్యాఖ్యలు

నిజమా?: మల్కాజిగిరి నుంచి లగడపాటి లడాయి

కూకట్ పల్లి నుంచి విజయశాంతి: రాములమ్మ కోసం బాలయ్య

click me!