
భువనగిరి: ప్లాట్ ఇప్పిస్తానని నమ్మించి స్నేహితుడిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటన ఆదివారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకొంది. గౌతమ్ అనే వ్యక్తి వద్ద రూ. 3లక్షలు తీసుకొని పారిపోయాడు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని నందనంలోని మెగా సిటీ వెంచర్లో ప్లాట్ ఇప్పిస్తానని చెప్పి గౌతమ్ అనే వ్యక్తిని అతని స్నేహితుడు విక్రమ్ తీసుకెళ్లాడు. గౌతమ్ వద్ద ఉన్న రూ. 3 లక్షలను తీసుకొన్నాడు. గౌతమ్‌పై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.
గౌతమ్ మరణించాడని భావించి విక్రమ్ పారిపోయాడు. అయితే తీవ్ర గాయాలతో అపస్మారకస్థితిలో ఉన్న గౌతమ్‌ను స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గౌతమ్ మృతి చెందాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.