తెలంగాణ మంత్రి వర్గం: ఆలస్యానికి కారణం చెప్పిన కేసీఆర్

By Nagaraju TFirst Published Dec 29, 2018, 8:31 PM IST
Highlights

తెలంగాణలో పూర్తి స్థాయి కేబినేట్ కూర్పుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పకనే చెప్పారు. శనివారం ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

హైదరాబాద్: తెలంగాణలో పూర్తి స్థాయి కేబినేట్ కూర్పుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పకనే చెప్పారు. శనివారం ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 50 రోజుల వరకు కేబినేట్ ఏర్పడని పరిస్థితులు అనేక  సందర్భాల్లోచోటు చేసుకున్న విషయాన్ని కేసీఆర్ పరోక్షంగా గుర్తు చేశారు. 

తెలంగాణలో అసెంబ్లీ మనుగడలో ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేశానని, అలాగే హోం మంత్రి కూడా ప్రమాణ స్వీకారం చేసిన దరిమిలా ఇక అసెంబ్లీ మనుగడలోకి వచ్చినట్లేనన్నారు. ఎమ్మెల్యేలు అంతా అధికారికంగా ఎమ్మెల్యేనని స్పష్టం చేశారు. 

అయితే మంత్రి వర్గ కూర్పుపై మరింత ఆలస్యం అయ్యేలా కేసీఆర్ సంకేతాలు పంపించారు. మంత్రి వర్గ ఏర్పాటుకు గల కారణాలను పరోక్షంగా కేసీఆర్ స్పష్టం చేశారు. మెుత్తం తెలంగాణలో సీఎం కేసీఆర్ తో కలిసి 18 మంది కేబినేట్ లో మత్రులుగా ఉంటారు. అయితే ఇప్పటి వరకు ఇద్దరు ఉన్నారు. ఇంకా 16 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చెయ్యాల్సి ఉంది. 

అయితే మంత్రి వర్గం ఏర్పాటు సంక్రాంతి తర్వాత ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. సంక్రాంతి ముందు వరకు అంతవరకు ముహూర్తాలు లేవని భావించిన కేసీఆర్ కేబినేట్ కూర్పుపై ఆలోచిస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం,కొద్ది మందితో మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తోంది. 

సంక్రాంతి తర్వాత కూడా పూర్తి స్థాయిలో కేబినేట్ ఏర్పడదని తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాతే పూర్తి స్థాయి కేబినేట్ ఏర్పడే అవకాశం ఉంది. పూర్తి స్థాయి కేబినేట్ ఏర్పాటయ్యే వరకు సంక్రాంతి తర్వాత  స్పీకర్, డిప్యూటీ స్పీకర్, 12 మందితో మంత్రి వర్గం ఏర్పడుతుందని సమాచారం. 

అయితే గతంలో రద్దు అయిన పార్లమెంటరీ సెక్రటరీలను తిరిగి పునరుద్ధరించేలా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. జార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న పార్లమెంట్ సెక్రటరీలను నియమించాలని కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. అందుకు అవసరమైతే చట్టం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.  

ఇకపోతే ఒకే స్వభావం ఉన్న శాఖలన్నీ ఒకే మంత్రికి వచ్చేలా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయం దాని అనుబంధ శాఖలన్నీ ఒకే గొడగు కిందకు వచ్చేలా కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.  

అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలలో కొందరితో ఎంపీగా పోటీ చేయించాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ లేటు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 

పార్లమెంటరీ సెక్రటరీల నియామకం, ఒకే స్వభావం ఉన్న శాఖలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే అంశాలపై అధ్యయనం చెయ్యాలంటూ కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే కేసీఆర్ కేబినేట్ పూర్తి అయిన తర్వాత జనవరి 21 నుంచి శతచండీ యాగం నిర్వహించనున్నట్లు సమాచారం.  
 

ఈ వార్తలు కూడా చదవండి

పంచాయితీ ఎన్నికల ఆలస్యానికి స్వప్నారెడ్డే కారణం...: కేసీఆర్

చంద్రబాబు లీడర్ కాదు, మేనేజర్: కేసీఆర్

ఆ పుణ్యం కట్టుకుంది ఎన్టీఆర్

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రధానికి లేఖ రాస్తా: కేసీఆర్

చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా కాస్కో,ఘోరంగా ఓడిపోతావ్: కేసీఆర్

హరికృష్ణ చావును కూడా రాజకీయం చేశాడు, అమాయకురాలిని బలిచేశాడు: కేసీఆర్

అప్పుడు మోడీ, ఇప్పుడు రాహుల్ గాంధీ సంకనాకుతున్న చంద్రబాబు

పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడిన వారికి కర్రు కాల్చి వాత పెట్టిన తెలంగాణ ప్రజలు: కేసీఆర్

 

click me!