రెడ్ మీ 7 నోట్‌కు సవాల్: విపణిలోకి శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 30

By rajesh yFirst Published Feb 28, 2019, 10:44 AM IST
Highlights

దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ మేజర్ ‘శామ్‌సంగ్’విపణిలోకి గెలాక్సీ ఎం30 మోడల్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ- కామర్స్ వెబ్‌సైట్లు అమెజాన్ ఇండియా, శాంసంగ్ వెబ్‌సైట్లలో శాంసంగ్ గెలాక్సీ ఎం30 సిరీస్ కొత్త స్మార్ట్ ఫోన్ల్లు అందుబాటులోకి వచ్చాయి. వచ్చే నెల ఏడో తేదీ నుంచి వినియోగదారులకు ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. 

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ మేజర్ ‘శామ్‌సంగ్’విపణిలోకి గెలాక్సీ ఎం30 మోడల్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ- కామర్స్ వెబ్‌సైట్లు అమెజాన్ ఇండియా, శాంసంగ్ వెబ్‌సైట్లలో శాంసంగ్ గెలాక్సీ ఎం30 సిరీస్ కొత్త స్మార్ట్ ఫోన్ల్లు అందుబాటులోకి వచ్చాయి. వచ్చే నెల ఏడో తేదీ నుంచి వినియోగదారులకు ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. 

ఇంతకుముందే ఎం వేరియంట్‌లో శామ్‌సంగ్ సంస్థ ప్రవేశపెట్టిన గెలాక్సీ సిరీస్‌ల్లో ఎం30  స్మార్ట్ ఫోన్ మూడవది. గత నెలలోనే శామ్‌సంగ్ రెండు గెలాక్సీ సిరీస్ (గెలాక్సీ ఎం10, గెలాక్సీ ఎం20) స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టింది. గెలాక్సీ ఎం30 సిరీస్ స్మార్ట్ ఫోన్లో ఫీచర్లపై అంచనాలు భారీగా ఉన్నాయి. రెండు గెలాక్సీ సిరీస్‌ల కంటే మూడో సిరీస్‌లో ఫీచర్లు ఆకర్షణీయంగా ఉంటాయని సంస్థ అధికారులు అంటున్నారు. 

గెలాక్సీ ఎం30 సిరీస్‌లో ట్రిపుల్ కెమెరా సెట్ అప్ యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. సెక్యూరిటీ కోసం రియర్ ఫింగర్ ఫ్రింట్ స్కానర్ కూడా ఉంది. లేటెస్ట్ ఎక్సోనస్ 7904 ప్రాసిసెర్, ఫ్రంట్ కెమెరా 16 మెగా ఫిక్సల్ ఉంటుంది. 

షియోమీ రెడ్ మీ నోట్ 7 మోడల్ ఫోన్‌కు ధీటుగా శామ్‌సంగ్ ఎం30 సిరీస్ ఫోన్‌ను విడుదల చేస్తోంది. రెడ్ మీ నోట్ 7 ఫోన్ లో 48 మెగాఫిక్సల్ ప్రైమరీ రియర్ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నది. ఈ ఫోన్ విడుదలకు ఒక రోజు ముందే శామ్‌సంగ్ మూడో గెలాక్సీ సిరీస్‍ను భారత విపణిలో విడుదల చేసింది. 

శామ్ సంగ్ గెలాక్సీ ఎం30 వేరియంట్ 4జీబీ రామ్ ప్లస్ 64 జీబీ స్టోరేజీ మోడల్ ఫోన్ ధర రూ.14,990 కాగా, 6జీబీ ప్లస్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,990గా నిర్ణయించారు. రెడ్ మీ నోట్ 7 ప్రో, నోకియా 6 ప్లస్, హానర్ 10 లైట్ మోడల్ ఫోన్లకు ఇది పోటీగా నిలువనున్నది. 

click me!