ట్రాయ్ గణాంకాల ప్రకారం మార్చి నెలలో జియో అత్యధికంగా 1,06,565 మంది మొబైల్ చందాదారులను చేర్చుకుంది. దీంతో జియో కస్టమర్ల సంఖ్య మార్చి నెలాఖరి నాటికి 3.27 కోట్లకు చేరుకుంది.
హైదరాబాద్: ట్రాయ్ (TRAI) విడుదల చేసిన తాజా టెలికాం చందాదారుల గణాంకాల ప్రకారం, రిలయన్స్ జియో లో ఈ ఏడాది మార్చి నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి 1.06 లక్షలకు పైగా కస్టమర్లు కొత్తగా వచ్చి చేరారు.
ట్రాయ్ గణాంకాల ప్రకారం మార్చి నెలలో జియో అత్యధికంగా 1,06,565 మంది మొబైల్ చందాదారులను చేర్చుకుంది. దీంతో జియో కస్టమర్ల సంఖ్య మార్చి నెలాఖరి నాటికి 3.27 కోట్లకు చేరుకుంది. ఇదే నెలలో ఎయిర్టెల్ లో 97 లక్షల మంది ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ లో 15,432 మంది కొత్త మొబైల్ చందాదారులు చేరారు. మరోవైపు వోడాఫోన్ ఐడియా 48,690 మంది కస్టమర్లను కోల్పోయింది.
మార్చి నెలలో దేశవ్యాప్తంగా కూడా జియో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. జియోలో 21.43 లక్షల మంది కొత్త చందాదారులు చేరారు. ఈ గణాంకాల ప్రకారం మార్చి 2024 లో దేశంలో మొత్తం జియో మొబైల్ కస్టమర్ల సంఖ్య 46.97 కోట్లకు చేరుకుంది.