Latest Videos

ఫ్రీ వై-ఫై.. ప్రభుత్వ ఈ క్రేజీ స్కీమ్ ఏంటో తెలుసా?

By Ashok kumar SandraFirst Published May 15, 2024, 7:12 PM IST
Highlights

బహిరంగ ప్రదేశాల్లో ఉచిత వై-ఫై యాక్సెస్‌ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వై-ఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్ స్కీమ్ అమలు చేస్తోంది.
 

కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఎన్నో  పథకాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో ఉచిత వై-ఫై సదుపాయం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వై-ఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్ (PM-WANI ) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం ప్రయాణ సమయంలో దేశంలోని ప్రతి పౌరుడికి ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించడం, తద్వారా డిజిటల్ ఇండియా మిషన్‌ను ముందుకు తీసుకెళ్లడం. PM-WANI కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్న  ప్రజలు ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందడంలో సహాయపడుతుంది. 

PM-WANI స్కిం  ప్రయోజనాలు:

స్పీడ్:

PM-WANI స్కీమ్ హై స్పీడ్ ఇంటర్నెట్‌ని అందిస్తుంది, దీని ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని ఎలాంటి అడ్డంకి లేకుండా పొందవచ్చు. 

ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం:

ఈ పథకం కింద రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు, హాస్పిటల్స్, విద్యా సంస్థలు, పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి వివిధ బహిరంగ ప్రదేశాలలో ఉచిత Wi-Fiని ఉపయోగించవచ్చు.


సెక్యూరిటీ:

PM-WANI ప్రోగ్రామ్ మీ డేటాను సురక్షితంగా ఉంచడంలో మీకు సహాయపడే సురక్షితమైన Wi-Fi నెట్‌వర్క్‌ను అందిస్తుంది.

ఫెసిలిటీ:

PM-WANI ప్రోగ్రామ్‌ని ఉపయోగించడం చాలా సులభం. మీ స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో "PM-WANI" Wi-Fi నెట్‌వర్క్‌ని సెలెక్ట్ చేసుకొని  అతేంటికేషన్  కోసం OTPని ఎంటర్  చేయండి.

PM-WANI పథకం కింద ఉచిత Wi-Fiని ఎలా పొందాలి:

*మొదట మీ స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో Wi-Fi సెట్టింగ్‌ ఓపెన్ చేయండి.

*ఇప్పుడు "PM-WANI" Wi-Fi నెట్‌వర్క్‌ని సెలెక్ట్ చేసుకోండి.

*మీరు అతేంటికేషన్  కోసం ఎంటర్ చేయవలసిన OTPని అందుకుంటారు.

*ఎంటర్ చేసిన తర్వాత, మీరు ఉచిత Wi-Fiని ఉపయోగించడం ప్రారంభించవచ్చు.

PM-WANI పథకం గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి, మీరు PM-WANI స్కిం  అధికారిక వెబ్‌సైట్‌ని https://pmwani.gov.in/లో సందర్శించవచ్చు. లేదా మీరు 1800-266-6666కి కూడా కాల్ చేయవచ్చు.

భారతదేశంలో డిజిటల్ చేరికను ప్రోత్సహించడంలో PM-WANI కార్యక్రమం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ కార్యక్రమం ప్రజలకు  సరసమైన ఇంకా సులభమైన ఇంటర్నెట్ యాక్సెస్‌ను అందిస్తుంది. ఇంకా విద్య, ఉపాధి ఇతర సామాజిక-ఆర్థిక అవకాశాలకు వారిని కనెక్ట్ చేయడంలో సహాయపడుతుంది. 

click me!