ఇప్పుడు ఆన్‌లైన్ లో ఇవి కొంటే.. అది ఫ్రీ ! కస్టమర్లు ఫిదా...

By Ashok kumar SandraFirst Published May 16, 2024, 11:49 PM IST
Highlights

అంగట్లో కూరగాయలు కొనే సమయంలో కొత్తిమీర ఫ్రీగా ఇవ్వకపోతే కూరగాయల షాపింగ్ మన  ఆడవాళ్లకు అసంతృప్తిగా ఉంటుందని భావిస్తుంటారు. అయితే, ఈ సిస్టం మాత్రం ఆన్‌లైన్ లో లేదు. ఇదేమిటని అడిగిన ఓ మహిళకు బ్లింకిట్ కొత్తిమీర ఉచితంగా ఇస్తోంది.
 

ఊర్లల్లో కూరగాయలు కొనేటప్పుడు కొత్తిమీర ఫ్రీగా ఇవ్వకపోతే  కూరగాయల షాపింగ్ అస్సలు చేసినట్టు  ఉండదని   చాలా మంది మహిళలు భావిస్తారు. భారతీయ స్త్రీలు ఎక్కువ కూరగాయలు కొన్నప్పుడు దుకాణదారుడి నుండి కొంచెం కొత్తిమీర అడగటం లేదా తీసుకోవడం  ఒకనాటి ఆచారం. కానీ ఆన్‌లైన్ షాపింగ్లో  అలాంటివి ఆశించలేం. ఇన్‌స్టామార్ట్‌లో కొత్తిమీర  కొనేటప్పుడు బ్లింకిట్, స్విగ్గి  వంటి వాటిలో విడిగా చెల్లించాల్సి ఉంటుంది.

ముంబైకి చెందిన అంకిత్ సా  వంత్ బ్లింకిట్ నుండి ఆర్డర్ చేస్తున్నప్పుడు వాళ్ళ  అమ్మ  కొత్తిమీర కోసం విడిగా డబ్బు చెల్లించాల్సి   వస్తుందని  తెలిసి నిరాశను వ్యక్తం చేశాడు. ఈ విషయాన్నీ  Xలో పోస్ట్‌లో షేర్  చేశారు.

Latest Videos

ఆన్‌లైన్ సైట్స్ లో కొంత మొత్తంలో కూరగాయలు కొన్నప్పుడు ఈ రకమైన ఆకుకూరలు ఉచితంగా ఇవ్వాలి' అని ఆయన సూచించారు. ఈ పోస్ట్ కంపెనీ  CEO అల్బిందర్ దిండ్సాతో సహా పలువురి దృష్టిని ఆకర్షించింది. దీనిని ఖచ్చితంగా చేస్తామని  అల్బిందర్ దిండ్సా రిప్లయ్ ఇచ్చారు.

తరువాత X సైట్ లో కూరగాయల షాపింగ్‌ ఈ మార్పును తీసుకొస్తుందని దిండ్సా వెల్లడించారు.  Blinkit ఇప్పుడు కొన్ని కూరగాయల ఆర్డర్‌లతో 100 గ్రాముల కాంప్లిమెంటరీ కొత్తిమీరను అందిస్తున్నట్లు  స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అయింది. దీన్ని 2.6 లక్షల మందికి పైగా చూడగా, దాదాపు 3,900 మంది దీన్ని లైక్ చేశారు. అంతేకాదు రకరకాలుగా కామెంట్లు కూడా వచ్చాయి.

"ప్రజల సమస్యలపై బ్లింకిట్ చాలా త్వరగా స్పందించింది' అని ఒక యూజర్  అనగా, 'ఈ ఫ్రీ కొత్తిమీర  ప్రతి తల్లి అభినందిస్తుంది' అని మరొకరు అన్నారు. 'ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించేందుకు మంచి ప్లాన్' అని మరొకరు కామెంట్ చేయగా, కొత్తిమీరతోపాటు పచ్చిమిర్చి కూడా ఉచితంగా ఇస్తే బాగుంటుంది' అని మరోరు సూచించారు.

 

click me!